సొంతూరులో అందాలు ఆశ్వాదిస్తూ లాక్ డౌన్ కి థాంక్స్ చెబుతున్న రష్మిక

లాక్ డౌన్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకి కష్టాలు పరిచయం చేసిన సెలబ్రెటీ ప్రముఖులకి మాత్రం కాస్తా సాంత్వన అందిస్తుంది అని చెప్పాలి.నిత్యం బిజీ జీవితంలో ఫ్యాషన్ ప్రపంచంలో లైట్లు వెలుగులో ముఖానికి రంగులు వేసుకొని నిజ జీవితంలో చిన్న చిన్న సంతోషాలకి దూరం అయిపోయేవారంతా ఇప్పుడు తమకి దొరికిన ఖాళీ సమయాన్ని బాగా ఆశ్వాదిస్తున్నారు.

 Rashmika Mandana Say Thanks To Lock Down, Tollywood, Telugu Cinema, South Cinema-TeluguStop.com

కుటుంబంతో గడుపుతూ ఇంట్లో కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు.అలాగే తమకి ఇష్టమైన పనులు కూడా చేస్తున్నారు.

సరదాగా, సందడిగా గడుపుతున్నారు.ఇక అందాల భామల సంతోషం అయితే చెప్పలేనిది.

కుటుంబానికి దూరంగా బ్రతికే వీరు ఇప్పుడు ఫామిలీతో కావాల్సినంత టైం స్పెండ్ చేస్తున్నారు.ఈ విషయంలో వారంతా లాక్ డౌన్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు.

ఈ విషయాన్ని టాలీవుడ్ బ్యూటీ రష్మిక కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.

లాక్ డౌన్ విధించిన మొదటి వారంలో హమ్మయ్య నేను కోరుకుంటున్న చిన్న బ్రేక్ దొరికింది అని ఫీలయ్యాను.

తర్వాత లాక్ డౌన్ మరోసారి పొడిగించాక ఇక ఇంటి మీదకు మనసు లాగింది.దాంతో హైదరాబాదు నుంచి అమ్మానాన్నల దగ్గరికి కూర్గ్ వెళ్లిపోయాను.చెప్పాలంటే, అసలు చిన్నప్పటి నుంచీ నేను ఇంటికి దూరమే.చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో వేశారు నన్ను.

దాంతో వేసవి సెలవులకు తప్ప మిగతా అన్ని రోజులూ ఇంటికి దూరంగానే వుండేదాన్ని.తర్వాత కాలేజీ చదువుకి మైసూరు వెళ్లాను.

ఆ వెంటనే సినిమాల్లోకి రావడంతో ఎప్పుడూ షూటింగులు, ప్రయాణాలతోనే సరిపోయింది.ఇప్పుడు కూర్గ్ వచ్చాక ఇన్నేళ్లలో నేను ఏం మిస్సయ్యానో తెలిసింది.

మా ఇంటి కిటికీలోంచి బయటికి చూస్తే మంచుతో నిండిన కొండలు, చుట్టూ సువాసన వెదజల్లే కాఫీ తోటలు, వావ్. అద్భుతంగా ఉందిక్కడ అంటూ రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం తాను ఆన్ లైన్ ద్వారా కొత్త కథలు వింటున్నానని చెప్పింది.గత కొన్నాళ్లుగా పనిలేకపోయినా, తన స్టాఫ్ తో పాటు తండ్రి బిజినెస్ కి సంబంధించిన ఉద్యోగులు మొత్తం ఇరవై మందికి జీతాలిస్తూ, వాళ్ల కుటుంబాల బాగోగులు చూసుకుంటున్నామని రష్మిక చెప్పింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube