మహేష్ బాబు సినిమా కోసం తమిళ హీరోని పక్కన పెట్టిన బ్యూటీ  

మహేష్ బాబు సినిమా కోసం తమిళ సినిమా ఆఫర్ వదులుకున్న రష్మిక మంధన.

Rashmika Mandana Dropped Tamil Movie For Mahesh Babu Movie-kollywood Movie,mahesh Babu Movie,rashmika Mandana,telugu Cinema,tollywood

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి రష్మిక మందన. చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతో సక్సెస్ కొట్టి గీత గోవిందం తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం మరోసారి విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ అతనితో రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేసింది..

మహేష్ బాబు సినిమా కోసం తమిళ హీరోని పక్కన పెట్టిన బ్యూటీ-Rashmika Mandana Dropped Tamil Movie For Mahesh Babu Movie

ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు జోడిగా కూడా ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు తన మొదటి సినిమా దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కు జోడిగా రాముడు మంచి బాలుడు సినిమాలో రొమాన్స్ చేయబోతుంది. అలాగే కోలీవుడ్లో హీరో కార్తీకి జోడిగా నటిస్తుంది.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ కోలీవుడ్లో శివ కార్తికేయన్ కి జోడిగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాని వదులుకున్నట్లు సమాచారం. మహేష్ బాబు సినిమా కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేను అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ కి రష్మిక మందన చెప్పినట్లు టాలీవుడ్ లో వినిపిస్తుంది. మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేరుకున్న తర్వాత రష్మిక మందన వరుస అవకాశాలతో టాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది