రష్మిక కన్నడ మూవీ తెలుగు రిలీజ్ రైట్స్ కి భారీ డిమాండ్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కన్నడ భామ రష్మిక మందన దూసుకుపోతుంది.తెలుగులో పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీతో పాటు, శర్వానంద్ కి జోడీగా ఒక సినిమాలో అలాగే ఆచార్యలో కూడా ఈభామ నటిస్తుంది.

 Rashmika Kannada Film Pogaru Telugu Rights Sold Out, Tollywood, Sandalwood, Dhru-TeluguStop.com

మరో వైపు ఓ రెండు పెద్ద సినిమాల కోసం రష్మిక పేరు వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామ తెలుగుతో పాటు మాతృభాష కన్నడకి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.

అక్కడ యాక్షన్ హీరో అర్జున్ అన్న కొడుకు ధృవ్ సర్జా హీరోగా పొగరు అనే సినిమా తెరకెక్కింది.ఇందులో ధృవ్ లోకల్ గుండాగా పవర్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించాడు.

ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యాడు.రీసెంట్ గా ఈ సినిమా నుంచి రష్మికని టీజ్ చేస్తూ ధృవ్ చేసే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో సాగే సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది.

ఇక సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్ అయ్యింది.ఈ సాంగ్ కి హైప్ రావడంతో పాటు రష్మిక పాపకి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో సినిమా తెలుగు థియాట్రికల్ రైట్స్ భారీ ధరకి అమ్ముడుపోయాయి.

Telugu Dhruva Sarja, Nanda Kishore, Pogaru, Sandalwood, Tollywood-Movie

ఈ చిత్రం తెలుగు హక్కులు 3 కోట్ల 30 లక్షల ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయాయి.ఈ విషయాన్ని చిత్రం హక్కులు తీసుకున్న వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత డి.ప్రతాప్ రాజు వెల్లడించారు.ఈ చిత్రాన్ని ఆయన సాయిసూర్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు.ఇక ఈ చిత్రంలోని ‘కరాబు మైండు కరాబు, మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు’ అంటూ సాగే పాటకి యూట్యూబ్ లో 43 మిలియన్ వ్యూస్ వచ్చాయని నిర్మాత ప్రతాప్ రాజు చెప్పారు.ఈ పాటకి ఇంత క్రేజ్ రావడం వల్లే సినిమా హక్కులకు పోటీ ఏర్పడిందని, తాము 3.3 కోట్లు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకున్నామని ఆయన తెలిపారు.మరి తెలుగులో రష్మిక కన్నడ చిత్రం ఎంత వరకు హిట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

రెండు చోట్ల ఒకే సారి రిలీజ్ చేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube