టాలీవుడ్ హీరో ప్రేమలో పడ్డ రష్మిక.. ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు?

Rashmika In Love With Tollywood Hero The Only Whispers In The Industry

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హోదాను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

 Rashmika In Love With Tollywood Hero The Only Whispers In The Industry-TeluguStop.com

పైగా కుర్రాళ్ళ హృదయాల్లో ఇండియన్ క్రష్ గా నిలిచింది.ఆ మధ్య మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా కూడా ఎంపికయింది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు ప్రేమలో పడ్డది.

 Rashmika In Love With Tollywood Hero The Only Whispers In The Industry-టాలీవుడ్ హీరో ప్రేమలో పడ్డ రష్మిక.. ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో పరిచయం అయింది.

ఇక ఈ సినిమాతో తొలి నటనతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని 2018లో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఛలో సినిమాతో పరిచయం అయింది.

ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అదే ఏడాది గీత గోవిందం, దేవదాస్ సినిమాలో నటించింది.

ఆ తర్వాత వరుసగా స్టార్ హీరో సినిమాలలో నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.

కేవలం తెలుగు, కన్నడ లోనే కాకుండా తమిళ, హిందీ భాషలో కూడా నటిస్తుంది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా వరుస సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటుంది.

Telugu Liger, Love, Pushpa, Rashmikaboy, Tollywood-Movie

ఇక రష్మిక ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వర్కౌట్ వీడియోలను తన అభిమానులతో బాగా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు కూడా పెడుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు షేర్ చేసింది.

ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో రష్మిక ప్రేమలో పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇంతకు ఆ పోస్ట్ లో ఏముందంటే.

తాను తన పాస్ పోర్ట్ ను షేర్ చేసుకుంది.పైగా ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

నేను ఎక్కడికి వెళుతున్నానో చెప్పుకోండి చూద్దాం అంటూ అభిమానులను ప్రశ్నించింది.

Telugu Liger, Love, Pushpa, Rashmikaboy, Tollywood-Movie

అంతేకాకుండా.ఈ సారి మీకు చాలా దూరంగా ఉంది.కాని త్వరలో తిరిగి వస్తుంది అంటూ తన ఫోటోతో మరో పోస్ట్ చేసింది.

దీంతో ఈ పోస్ట్ లు బాగా వైరల్ గా మారాయి.ఇది చూసిన నెటిజెన్లు రష్మిక అమెరికాకు వెళ్ళింది అంటూ అక్కడ లైగర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ను కలవడానికి వెళ్ళింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Telugu Liger, Love, Pushpa, Rashmikaboy, Tollywood-Movie

గతంలో రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య ఏదో ఉందని టాక్ వచ్చింది.కొందరైతే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా అన్నారు.కానీ ఈ విషయం గురించి ఈ జంట ఎప్పుడు ఓపెన్ కాలేదు.కానీ ఫ్యామిలీ పార్టీలలో మాత్రం ఒకరి ఇంటికి మరొకరు వెళ్తుంటారు.దీంతో రష్మిక అమెరికాకు వెళ్లడంతో విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉందని అందుకే అక్కడికి వెళుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం రష్మిక మందన పుష్ప తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలలో, తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది.

#Liger #Pushpa #RashmikaBoy #Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube