కన్నడ భామ నేషనల్ క్రష్ రష్మిక పని అయిపోయిందని అంటూ వార్తలు వస్తున్నాయి.కానీ రష్మిక మాత్రం తనలో తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
బాలీవుడ్ లో చేసిన రెండు సినిమాల్లో ఒకటి ఫ్లాప్ అవగా రెండోది యావరేజ్ గా నిలిచింది.ఇక థర్డ్ మూవీగా వస్తున్న యానిమల్ మీద అమ్మడు ఆశలన్ని పెట్టుకుంది.
సందీప్ వంగ సినిమా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.ఆ సినిమా హీరో రణ్ బీర్ కపూర్ ఈమధ్య యానిమల్ సినిమా కథ వినగానే షివరింగ్ వచ్చిదని అన్నారు.
సో హీరోకే అలా అనిపించింది అంటే కచ్చితంగా సినిమాలో రష్మిక పాత్ర అదరగొడుతుందని అంటున్నారు.ఇక యానిమల్ హిట్ పడినా పడకపోయినా విజయ్ దేవరకొండ తర్వాత చేసే సినిమాలో అమ్మడినే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్.
దిల్ రాజు నిర్మాతగా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమాలో రష్మిక ఛాన్స్ అందుకుందని టాక్.సో విజయ్ తో రష్మిక అంటే ఆ క్రేజీ జంట సినిమా హిట్ పక్కా అన్నట్టే.
సో రష్మిక కెరీర్ కైతే ఎలాంటి డోకా లేదని చెప్పొచ్చు.