విక్రమార్కుడు సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిన రష్మిక... అదృష్టం మామూలుగా లేదు?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) .ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు.

 Rashmika Got A Chance In The Sequel Of Rowdy Rathore Movie Details, Rajamouli,ra-TeluguStop.com

ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా మారిపోయారు.ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా మరొక బాలీవుడ్ సినిమా అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తుంది.

Telugu Akshay Kumar, Rajamouli, Raviteja, Rowdy Rathore, Sanjayleela, Shahid Kap

తెలుగులో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రవితేజ(Raviteja) హీరోగా ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం విక్రమార్కుడు(Vikramarkudu) .ఈ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అవ్వడంతో ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా రౌడీ రాథోర్(Rowdy Rathore) అనే టైటిల్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది అని చెప్పాలి.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి రౌడీ రాథోర్ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ చిత్రాన్ని చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.

Telugu Akshay Kumar, Rajamouli, Raviteja, Rowdy Rathore, Sanjayleela, Shahid Kap

ఈ క్రమంలోనే రౌడీ రాథోర్ సీక్వెల్ చిత్రానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది.ఇక ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ కి బదులు షాహిద్ కపూర్ ( Shahid Kapoor) నటించబోతున్నారట.ఈ క్రేజీ ప్రాజెక్టులో రష్మిక మందన్న హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారని తెలుస్తోంది.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకోవడంతో ఈమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా(Prabhu Deva) దర్శకుడిగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube