విజయ్ కు లిప్ లాక్ ఇవ్వడమే ఇప్పుడు రష్మిక కు పెద్ద సమస్యగా మారింది.! ఏమైందంటే?  

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటించిన “గీత గోవిందం” సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా హిట్ అంటున్నారు ఆడియన్స్ అంతా. సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు అందిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీకవడం కలంకలం రేపింది. దీంతో గత నాలుగు రోజులుగా తెలుగు మీడియా, సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. అయితే ఒకరకంగా దీనివల్ల సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఈ లీక్ లో ఓ లిప్ లాక్ సీన్ కూడా ఉంది.

ఈ సినిమా రిలీజ్ కి ముందు రష్మిక ను ట్విట్టర్ లో కామెంట్స్ చేసారు కొంతమంది. పెళ్లి కుదిరిన తర్వాత రొమాంటిక్ సీన్స్ లో నటిస్తున్నావు ఏంటి అని? దానికి రష్మిక కౌంటర్ కూడా ఇచ్చింది. హీరోలు చేయట్లేదా అని?

Rashmika Face Problems With Vijay Deverakonda Lip Lock-

Rashmika Face Problems With Vijay Deverakonda Lip Lock

రష్మిక తెరకు పరిచయం అయిన కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ హీరో రక్షిత్ షెట్టితో ఆమెకు కొన్నాళ్ల కిందట నిశ్చితార్థం జరిగింది. ఆ హీరోతో ఎంగేజ్డ్ అయిన రష్మిక సినిమాల్లో బోల్డ్ గా కనిపించడం ఏమిటి? అంటూ ఫ్యాన్స్ మండిపడుతూ వస్తున్నారు. ఆమె అలా నటించకూడదని ఫ్యాన్స్ నియమాలు పెడుతున్నారు. మరోవైపు కన్నడ పత్రికలు కూడా మంటపెడుతున్నాయి. గీతగోవిందంలో రష్మిక స్టిల్స్ ను చూసి రక్షిత్ షెట్టి మండిపడుతున్నాడని, దీంతో వీరి నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ కానుందని కొన్ని కన్నడ పత్రికలు మొదలుపెట్టాయి. అయితే ఆ విషయాన్ని రష్మిక, రక్షిత్‌లు ఖండించారు.

విజయ్, రష్మికలు లిప్‌లాక్ పెట్టుకుంటున్న ఆ పోజును చూసి కన్నడీగులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఆమెపై మండిపడిన వాళ్లు.. ఇప్పుడు మరింతగా విరుచుకుపడుతున్నారు. రష్మిక తెలుగు సినిమాలో నటించడానికి రక్షిత్ ఒప్పుకుని ఉండాల్సింది కాదని వ్యాఖ్యానిస్తున్నారు.