నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతోఎంతో బిజీగా ఉన్నారు.భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
ఇక ప్రస్తుతం ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.తమిళంలో హీరో విజయ్ సరసన ఈమె నటించిన వరిసు సినిమా తమిళ వెర్షన్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మిషన్ మజ్ను సినిమా కూడా జనవరి 20వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు.సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు సంపాదించుకున్న ఈమె పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్ గా గుర్తింపు పొందారు.అయితే గత కొద్దిరోజుల క్రితం రష్మిక పుష్ప2 సినిమాలో నటించిన ఈ సినిమా నుంచి ఈమె తప్పుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై తాజాగా రష్మిక స్పందించి క్లారిటీ ఇచ్చారు.
రష్మిక నటించిన రెండు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఏంటి అని ప్రశ్నించడంతో రష్మిక పుష్ప ది రూల్, మిషన్ మజ్ను, వారసుడు, యానిమల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు.రష్మిక ఇలాంటి సమాధానం ఇవ్వడంతో ఈమెను పుష్ప2 సినిమా నుంచి తప్పించారని వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని క్లారిటీ వచ్చేసింది.