ఎన్ని ఉన్నా పుష్ప సినిమాకే మొదటి ఓటు అంటున్న రష్మిక !

కరోనా నుండి ఇప్పుడిప్పుడే మన దేశం బయటపడుతుంది.కేసులు కూడా తగ్గడంతో సినిమా షూటింగ్స్ కూడా ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతున్నాయి.

 Rashmika Dedicated July For Pushpa-TeluguStop.com

అలాగే పుష్ప సినిమా షూటింగ్ కూడా త్వరలోనే రీస్టార్ట్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్ప సినిమా తెరకెక్కుతుంది.

సుకుమార్ బన్నీ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.ఇప్పుడు మూడవసారి వీరి కాంబోలో సినిమా రాబోతుండడంతో అంచనాలు ఒక రేంజ్ లోకి వెళ్లాయి.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.

 Rashmika Dedicated July For Pushpa-ఎన్ని ఉన్నా పుష్ప సినిమాకే మొదటి ఓటు అంటున్న రష్మిక -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనివల్ల ముందుగా అనుకున్న సమయానికి పుష్ప సినిమాను విడుదల చేయలేక పోతుంది చిత్ర యూనిట్.

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.

ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ ఖర్చుతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు తెలిసింది.అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకు పోతుంది.ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.

అయితే రష్మిక చేతిలో ఎన్ని సినిమాలు ఉన్న పుష్ప సినిమాకే మొదటి ఓటు అంటుంది.అందుకే ముందు పుష్ప సినిమా షూట్ లోనే పాల్గొనబోతుందని తెలుస్తుంది.జులై లో ప్రారంభం కాబోతున్న పుష్ప షెడ్యూల్ కోసం రష్మిక ఒక నెల మొత్తం డేట్స్ ఇచ్చేసిందని టాక్.

#Pushpa #Corona #Sukumar #Cinima Shooting #Push Pa Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు