సినీ ఇండస్ట్రీలో రష్మీక విజయ్ దేవరకొండ ( Rashmika Vijay Deverakonda ) జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు ఈ సినిమాలలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ భారీగా ఉండడంతో ఈ జంటను అభిమానించే వారి సంఖ్య అధికమైంది.ఇలా ఈ రెండు సినిమాలు సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ప్రస్తుతం వీరు రిలేషన్ లో ఉన్నారని అయితే ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు అంటూ తరచూ వీరిద్దరి రిలేషన్( Relation ) గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే వీరిద్దరూ పెళ్లికి కూడా పెద్దలు అంగీకరించారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.
ఇక ఈ పెళ్లి వార్తలను విజయ్ దేవరకొండ ఖండించారు కానీ రష్మిక తాజాగా తనకు కాబోయే భర్త VD అంటూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.రష్మిక మందాన ఢిల్లీ ఫ్యాన్స్ ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో ఒక పోస్ట్ దర్శనం ఇచ్చింది.అందులో రష్మికకు కాబోయే భర్త VD లా ఉండాలని వీడి అంటే వెరీ డేరింగ్, అదేవిధంగా మేము రష్మిక మందన్నను క్వీన్ అని పిలుచుకుంటాము కనుక అతడు కింగ్ అయి ఉండాలి అంటూ అభిమానులు ఒక పోస్ట్ చేశారు.
ఇలా ఈ ట్వీట్ సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారడంతో దీనిపై రష్మిక స్పందిస్తూ.అవును ఇది నిజం అంటూ స్మైలీ ఎమోజితో పాటు లవ్ సింబల్( Love Symbol ) తో పోస్ట్ చేశారు దీంతో రష్మిక ఇది నిజమేనని ఒప్పుకోవడంతో ఈమెకు కాబోయే భర్త విజయ్ దేవరకొండనే అని అభిమానులు కూడా ఓ క్లారిటీకి వచ్చారు.ఎందుకంటే అభిమానుల దృష్టిలో VD అంటే విజయ్ దేవరకొండ తనని అలాగే పిలుస్తారు.ఇక తనే తన భర్తగా రావడం వాస్తవం అంటూ ఈమె పరోక్షంగా కామెంట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు.
దీన్ని బట్టి చూస్తుంటే ఏ క్షణమైనా వీరి పెళ్లి వార్త అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.