రష్మీ గౌతమ్‌ నీ హద్దుల్లో ఉండు లేదంటే ఇబ్బందులు పడతావు  

Rashmi Support To Talk Jagan Mohan Reddy About Ap Elections Post Pone - Telugu Ap Elections Post Pone, Corona Effect On Ap Elections, Rashmi Active In Social Media, Rashmi Gautham, Rashmi Jabardasth Anc, Rashmi Support To Talk Jagan Mohan Reddy

ఈమద్య కాలంలో రష్మీ గౌతమ్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్న పోస్ట్‌లు విమర్శలకు తావిస్తున్నాయి.తాజాగా ఎన్నిక కమీషన్‌ తీరుపై రష్మీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర తీశాయి.

 Rashmi Support To Talk Jagan Mohan Reddy About Ap Elections Post Pone

కరోనా ప్రభావం వల్ల ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదు అంటూ ఎన్నికల కమీషనర్‌ ఎన్నికలను వాయిదా వేయిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.ఎన్నికల హడావుడి అంతా పూర్తి అయ్యి చాలా ఖర్చు చేసిన తర్వాత ఎన్నికలు వాయిదా పడటంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.

ఎన్నికల వాయిదాను సీఎం జగన్‌ తీవ్రంగా తప్పుబడుతున్నాడు.ఇలాంటి చర్యలు కరెక్ట్‌ కాదని కరోనా ఉంటే తాము ఆ విషయాన్ని చూసుకుంటాం.మీకు ఆ విషయం గురించి సంబంధం లేదు.మా ఆరోగ్య శాఖ మరియు ఇతర విభాగాలు ఆ విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం.

రష్మీ గౌతమ్‌ నీ హద్దుల్లో ఉండు లేదంటే ఇబ్బందులు పడతావు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మీరు దాని గురించి ఆలోచించకుండా ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ జగన్‌ డిమాండ్‌ చేసిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో సీఎంగా జగన్‌కు మద్దతుగా రష్మీ గౌతమ్‌ మాట్లాడటం జరిగింది.

కరోనా భయంతో ఎన్నికలను వాయిద వేయడం సరైన నిర్ణయం కాదని చెప్పుకొచ్చింది.ఇంట్లో ఉంటే కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందా అంది.అలాగే కరోనా భయం ఉన్నా కూడా జనాలు బయటకు రాకుండా ఉంటారా అంటూ మరో ట్వీట్‌లో పేర్కొంది.మొత్తానికి ఎన్నికల వాయిదా విషయాన్ని రష్మీ గౌతమ్‌ తప్పుబట్టింది.

అయితే రష్మీ కామెంట్స్‌పై కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.నీకు సంబంధం లేని ఈ విషయంలో నీ ఇన్వాల్మ్‌ఎంట్‌ ఏంటీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

రాజకీయాల గురించి ఎక్కువగా స్పందిస్తే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నెటిజన్స్‌ హెచ్చరిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Effect On Ap Elections,rashmi Active In Social Media,rashmi Gautham,rashmi Jabardasth Anc,rashmi Support To Talk Jagan Mohan Reddy- Related Telugu News,Photos/Pics,Images..