రష్మీకి సమస్యలు సృష్టిస్తున్న సుడిగాలి సుధీర్?  

sudigali sudheer fans creating problems for anchor rashmi Rashmi, Sudigali Sudheer, Jabardasth, Dhee Dance Show, Bomma Block Buster, Nandhu, Sudheer Fans, Rashmi And Sudheer Marriage - Telugu Bomma Block Buster, Dhee Dance Show, Jabardasth, Nandhu, Rashmi, Rashmi And Sudheer Marriage, Sudheer Fans, Sudigali Sudheer, Sudigali Sudheer Fans Creating Problems For Anchor Rashmi

బుల్లితెర జోడీల్లో రష్మీ సుధీర్ జోడీకి అభిమానుల్లో ఉండే క్రేజే వేరు.వీళ్లిద్దరూ కలిసి ఏ షో చేసినా ఆ షో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.

TeluguStop.com - Rashmi Sudigali Sudheer Jabardasth

రష్మీ సుధీర్ లను ఉమ్మడిగా అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.చాలామంది అభిమానులు రష్మీ సుధీర్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ప్రస్తుతం సుడిగాలి సుధీర్ అభిమానుల వల్ల రష్మీ కెరీర్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.

TeluguStop.com - రష్మీకి సమస్యలు సృష్టిస్తున్న సుడిగాలి సుధీర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రష్మీ బుల్లితెరపై జబర్దస్ట్ షోకు యాంకర్ గా వ్యవహరించడంతో పాటు పలు ఈవెంట్లలో సందడి చేస్తూ వెండితెరపై సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

రష్మీ హీరోయిన్ గా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించినా గుంటూరు టాకీస్ మినహా మరే సినిమా సక్సెస్ సాధించలేదు.రష్మీ హీరోయిన్ గా నటించిన కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా ప్రేక్షకులకు తెలీదు.

రష్మీ లాక్ డౌన్ కు ముందు హీరో నందుతో కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటించింది.

ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా గొడవలు పెట్టే పాత్రలో రష్మీ నటిస్తోంది.

ఇప్పటికే బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచింది.త్వరలో ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రష్మీ భావిస్తోంది.

అయితే రష్మీ నందుతో కలిసి నటించడం కొంతమంది సుధీర్ అభిమానులకు నచ్చడం లేదు.దీంతో కొందరు సుధీర్ అభిమానులు రష్మీని ఇతర హీరోల సినిమాల్లో నటించవద్దని కోరుతున్నారు.

సుడిగాలి సుధీర్ సినిమాల్లో మాత్రమే నటించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.గతంలో అనేక ఇంటర్వ్యూలలో రష్మీ సుధీర్ తనకు స్నేహితుడు మాత్రమేనని వివరణ ఇచ్చింది.అయితే రష్మీ చెప్పినా కొందరు అభిమానులు రష్మీ సోషల్ మీడియాలో సుధీర్ తో మాత్రమే నటించాలని చెబుతూ ఆమె కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

#SudigaliSudheer #Dhee Dance Show #Sudheer Fans #RashmiAnd #Jabardasth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmi Sudigali Sudheer Jabardasth Related Telugu News,Photos/Pics,Images..