ఉప్పెన సాంగ్ కి డ్యూయెట్ పాడుకున్న రష్మీ, సుధీర్..?

ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ తో విజయం సాధించిన సినిమా ఉప్పెన.ఇక ఈ సినిమాలో విడుదలైన పాటలకు మాత్రం విపరీతమైన లైకులు కూడా వచ్చాయి.

 Rashmi Sudigaali Sudheer And Deepika Pilli Hyper Aadhi Romance With Uppena Song-TeluguStop.com

ఇక అందులో మరో రొమాంటిక్ పాట ‘జల జల జల పాతం’ పాట మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ గా మారింది.అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఈ పాటను బాగా ఆస్వాదిస్తున్నారు.

తాజాగా ఈ పాటకి డాన్స్ చేసిన రష్మి సుధీర్ ర్ వీడియో వైరల్ గా మారింది.

ఈటీవీలో ప్రసారమవుతున్న డీ జోడి షో గురించి అందరికీ తెలిసిందే.

ఇక ఇందులో ప్రదీప్ యాంకర్ గా చేస్తున్నాడు.అంతేకాకుండా కింగ్స్, క్వీన్స్ అనే టీమ్ లీడర్స్ గా ఉన్న హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్, దీపిక పిల్లి.

వీళ్లు జంటలుగా కలిసి షో లో మొత్తం ఓ రేంజ్ లో ఆట ఆడుకుంటారు.అంతేకాకుండా వారి మధ్య కొన్ని హాస్య పూరిత సంభాషణలు, డాన్సులు జరుగుతుంటాయి.

తాజాగా వీళ్లు జంటలుగా ఉప్పెన సాంగ్ కు డాన్స్ చేస్తూ ఉన్న ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

రష్మి సుధీర్ లు కలిసి వేదికపై పడవలో ఈ పాట తో డాన్స్ చేస్తూ తెగ రొమాన్స్ లో మునిగిపోయారు.

హగ్, టచ్ లు ఇచ్చుకుంటూ బాగా రెచ్చిపోయారు.అంతేకాకుండా వీరిద్దరూ కలిసి అందరూ చూస్తుండగానే పడవలోకి ఎవరు కనిపించకుండా జారుకున్నారు.అక్కడ ఉన్న వాళ్లంతా ఈ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు.అంతే కాకుండా మరో జంట హైపర్ ఆది, దీపిక పిల్లి కూడా అందరూ చూస్తుండగానే తమ డ్యాన్స్ తో రెచ్చిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube