ప్రేక్షకులను పిచ్చోళ్లను చేస్తున్న రష్మీ సుధీర్..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెళ్లలో రష్మీ సుధీర్ జంట గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ఆన్ స్క్రీన్ లో రష్మీ సుధీర్ ఒకరిపై ఒకరు వేసుకునే పంచులు, వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

 This How Sudheer And Rashmi Make Audience Fools For Their Career, Rashmi Gautam,-TeluguStop.com

చాలామంది వీళ్లు నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని.భవిష్యత్తులో పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఒక ప్రముఖ ఛానల్ లో రష్మీ సుధీర్ జంట స్పెషల్ అట్రాక్షన్ గా కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్ లను కూడా డిజైన్ చేస్తున్నారు.అయితే రష్మీ సుధీర్ నిజంగా ప్రేమించుకుంటున్నారా.? భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోతున్నారా.? అనే ప్రశ్నలకు మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి.ఇద్దరూ తమ కెరీర్ కోసమే షోలలో ఒకరిపై ఒకరికి ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని అంతకు మించి వాళ్లిద్దరి మధ్య ఏం లేదని తెలుస్తోంది.

టీవీ షోలలో గాఢమైన ప్రేమికులుగా కనిపిస్తున్న ఈ జంటకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ను చూసి ప్రోగ్రామ్ ల నిర్వాహకులు వీళ్లకోసం స్పెషల్ గా డైలాగ్ లను, పాటలను డిజైన్ చేస్తున్నారు.

సుధీర్, రష్మీ కూడా తమ్ కెరీర్ కోసం ప్రేక్షకులను మభ్యపెడుతున్నారు.తాజాగా సుధీర్ మరోసారి స్పందించి రష్మీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన సక్సెస్ కు రష్మీ కారణం అని.తమ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని చెప్పారు.

తనకు రష్మీ జోడీగా నటించడం వల్లే మంచి ఛాన్సులు వచ్చాయని సుధీర్ పేర్కొన్నారు.దీంతో ఒకరకంగా సుధీర్ రష్మీ జంట ప్రేక్షకులను పిచ్చోళ్లను చేశారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

గతంలో రవి లాస్య కూడా ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాగా ఆ తర్వాత ఆ వార్తలు నిజం కాదని తేలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube