పెళ్లి చేసుకున్న రష్మీ సుడిగాలి సుధీర్.. ఆ నటి ఆశీర్వాదంతో..?

బుల్లితెరపై కమెడియన్ గా సుడిగాలి సుధీర్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ కు, అతని పంచ్ లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

 Rashmi Sudheer Marriage In Jabardasth Show Promo Goes Viral In Social Media,late-TeluguStop.com

సుధీర్ రష్మీ ప్రేమలో ఉన్నారని గత కొన్నేళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే సుధీర్ రష్మీ మాత్రం ఆన్ స్క్రీన్ లో నిజమైన లవర్స్ లా కనిపించినా ఆఫ్ స్క్రీన్ లో మాత్రం తమ మధ్య ఏమీ లేదని చెబుతున్నారు.

తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో రష్మీ సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకున్నారు.గతంలోనే రష్మీ సుధీర్ పెళ్లి చేసుకున్నట్టు ఈవెంట్లు ప్రసారం కాగా మళ్లీ అదే తరహా ఈవెంట్లు ప్రసారం కావడం గమనార్హం.సుధీర్ రష్మీ హైపర్ ఆది దీపికా పిల్లి కూడా పెళ్లి దుస్తుల్లో కనిపించారు.ప్రోమోలో అనసూయ పండగ లేకపోయినా పండగలా ఉంది ఈరోజు అని చెప్పగా రోజా నిజమే నిజమే అని చెబుతారు.

జబర్దస్త్ కమెడియన్ నేను నీ అంత గొప్పోడు కావాలంటే ఏం చేయాలని సుధీర్ ను అడుగుతాడు.సుధీర్ ఆ ప్రశ్నకు సమాధానంగా అబద్ధాలు ఆడకూడదని చెప్పగా జబర్దస్త్ కమెడియన్ మరి ఏం ఆడాలని అడిగితే హైపర్ ఆది అమ్మానాన్న ఆట ఆడాలని సమాధానంగా చెబుతాడు.

సుధీర్ రష్మీతో సూర్యరశ్మి ఉన్నంత కాలం సుధీర్ రష్మీ అలాగే ఉంటారని చెబుతాడు.రష్మీ వెరైటీ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వగా ఆది నువ్వు ఓలేటి లక్ష్మీలా వయ్యారాలు పోవొద్దని రష్మీకి చెబుతాడు.

ఆ తరువాత సూర్యరశ్మి అంటే పగలే ఉంటుందని మరి సుధీర్ రాత్రి ఎక్కడ ఉంటాడో కనుక్కోవాలని హైపర్ ఆది రష్మీకి చెబుతాడు.సుధీర్ అడుగు అని రష్మీ చెప్పగా పదిన్నర అయింది ఏంటి మరీ అంటూ సుధీర్ డబుల్ మీనింగ్ పంచ్ వేస్తాడు.రోజా ఆశీర్వాదంతో జబర్దస్త్ కమెడియన్లు పెళ్లి చేసుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube