బిగ్‌ బాస్‌ 3 కోసం రష్మి, సుధీర్‌... ఛాన్స్‌ ఉందా, నిజమైతే పరిస్థితి ఏంటీ?

ఉత్తరాదిన అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న బిగ్‌బాస్‌ మెల్ల మెల్లగా సౌత్‌కు వచ్చింది.తెలుగు మరియు తమిళంలో మంచి విజయాన్ని ఈ షో దక్కించుకుంది.

 Rashmi Sudheer In Big Boss 3 Show-TeluguStop.com

తమిళంలో రెండు సీజన్‌లకు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు.మూడవ సీజన్‌కు కూడా ఆయనే హోస్టింగ్‌ చేయబోతున్నాడు.

ఇక తెలుగు విషయానికి వస్తే మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండవ సీజన్‌కు నాని హోస్ట్‌లుగా వ్యవహరించగా మూడవ సీజన్‌కు నాగార్జున హోస్టింగ్‌ చేసే అవకాశం కనిపిస్తుంది.హోస్ట్‌ విషయమై క్లారిటీ వచ్చింది.

ఇక పార్టిసిపెంట్స్‌ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీముఖి మరియు ఉదయ భానులు కనిపించబోతున్నారు.

ఇక ఇదే సీజన్‌లో మరో బుల్లి తెర సెన్షేషన్‌ జంట అయిన సుధీర్‌ మరియు రష్మికలు కూడా ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం పార్టిసిపెంట్ల ఎంపిక కూడా జరుగుతుంది.

ఈ క్రమంలోనే నిర్వాహకులు రష్మిక మరియు సుధీర్‌లను ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.జబర్దస్త్‌తో పాటు జోడీలో వీరిద్దరు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు.

బిగ్‌ బాస్‌ 3 కోసం రష్మి, సుధీర

వీరిద్దరు ఖచ్చితంగా బిగ్‌బాస్‌కు మంచి హైప్‌ తీసుకు రాగలరు.కాని వీరిద్దరు బిగ్‌బాస్‌కు కలిసి వెళ్లడం అనేది సాధ్యం అయ్యే పని కాదు.కలిసి కాదు కనీసం వీరిద్దరిలో ఒక్కరు కూడా బిగ్‌బాస్‌కు వెళ్లరు.ఎందుకంటే వారిద్దరి షెడ్యూల్‌ అంత బిజీగా ఉంటుంది.బిగ్‌బాస్‌ నిర్వాహకులు వారి పారితోషికాలు కూడా ఇవ్వలేక పోవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది.ఒక వేళ ఇద్దరు కూడా బిగ్‌బాస్‌ 3లో ఉంటే మాత్రం రచ్చ రచ్చ ఖాయం.

భారీ టీఆర్పీ రేటింగ్‌ కూడా వస్తుంది.వారిద్దరి మద్య రొమాన్స్‌తో ఢీ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలాగే బిగ్‌బాస్‌ 3లో వారు ఉంటే దుమ్ము దుమ్మే.మరి అలా సాధ్యమేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube