సుధీర్ పరువు తీసేసిన రష్మీ.. అందరినీ అడిగావంటూ ..?

బుల్లితెర రీల్ జోడీలలో ఎన్ని జోడీలు ఉన్నా సుధీర్ రష్మీ జోడీ స్పెషల్ జోడీ అనే సంగతి తెలిసిందే.ఈ జోడీ రీల్ జోడీనే అయినా రియల్ జోడీ అయితే బాగుంటుందని చాలామంది అభిమానులు భావిస్తున్నారు.

 Rashmi Punches On Sudigali Sudheer In Jabardasth Show Skit-TeluguStop.com

అయితే తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమోలో సుధీర్ పై రష్మీ పంచ్ లు వేసి కడుపుబ్బా నవ్వించారు.ఈ ప్రోమోలో సుధీర్ నైటీలో వటపత్రసాయికి పాటతో బిడ్డను ఎత్తుకుని ఎంట్రీ ఇస్తారు.

వెరైటీ గెటప్ లో ఉన్న సుధీర్ ను చూసి రోజా చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదని అంటారు. రామ్ ప్రసాద్ అసలు నువ్వు అబ్బాయి అయ్యి ఉండి గర్భం రావడమేంటి.? శ్రీమంతం చేయడం ఏంటి.? నీకు డెలివరీ బాబు పుట్టడం ఏమిటి.? అని చెబుతుండగా రష్మీ సుధీర్ కు పుట్టింది పాపా.? బాబా.? అంటూ పంచ్ వేస్తారు.రామ్ ప్రసాద్ రష్మీని నువ్వుండమ్మా.! అసలీ బిడ్డకు నాన్నెవరో తెలియడం లేదని పంచ్ వేయడంతో సుధీర్ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు.

 Rashmi Punches On Sudigali Sudheer In Jabardasth Show Skit-సుధీర్ పరువు తీసేసిన రష్మీ.. అందరినీ అడిగావంటూ ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత సుధీర్ రామ్ ప్రసాద్ తో ఖాళీగా ఉంటే వచ్చి బిడ్డకు నీళ్లు పోయాలని చెప్పగా ఆటో రామ్ ప్రసాద్ పంచ్ లు.నన్ను నీళ్లు పొయ్యమంటావా.? అని అడగగా సుడిగాలి సుధీర్ నేనే బాబుని కన్నా అంటూ సుధీర్ కడుపుబ్బా నవ్వేలా కామెడీ చేశారు.ఆ తరువాత రామ్ ప్రసాద్ బిడ్డను పడుకోబెట్టడానికి మంచి పాట పాడమని సుధీర్ కు చెప్పగా నిన్నుకోరి సినిమాలోని అడిగా అడిగా పాటను పాడతాడు.

రష్మీ వెంటనే అంతమందిని అడిగావు కాబట్టే ఈ విధంగా జరిగింది అంటూ సుధీర్ పరువు తీసేసింది.రష్మీ వేసిన పంచ్ పంచ్ కు జడ్జీలు రోజా, మనో కడుపుబ్బా నవ్వుతారు.ఈ ఎపిసోడ్ కు హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గెస్టులుగా హాజరయ్యారు.

అయితే సుధీర్ నైటీ వేసుకుని వెరైటీ గెటప్ లో కనిపించడంతో అతని ఫ్యాన్స్ ఇంకోసారి ఇలాంటి గెటప్ లో కనిపించవద్దని సుధీర్ కు సూచిస్తున్నారు.

#Rashmi #Sudheer #Sundeep Kishan #RashmiPunches #ExtraJabardast

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు