రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు     2017-01-17   21:31:43  IST  Raghu V

టీవి యాంకర్ గా ఫామ్ లో ఉండగా, గేరు మార్చి “గుంటూరు టాకీస్” లో అందాల ఆరబోతతో అందరిని ఆశ్చర్యపరిచింది రష్మీ. ఆ సినిమా వలన తనకి ఐటం సాంగ్ ఆఫర్స్ ఎక్కువ వస్తాయని అప్పట్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఐటం సాంగ్ ఆఫర్స్ అయితే వచ్చాయి కాని, పెద్ద హీరోల సినిమాల్లో కాదు. పోని, పెద్ద సినిమాల్లో మంచి పాత్రలేమైనా వచ్చాయా అంటే, అదీ లేదు.

కేవలం స్కిన్ షో మీదే ఆధారపడి చేసిన కొన్ని ప్రయత్నాలు కూడా బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో రష్మీ క్యాలెండర్ ఖాలీ అయిపోయింది. తాజాగా రాజ్ తరుణ్ నటిస్తున్న “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాలో రష్మీని ఐటం సాంగ్ కోసం అడిగారట. కాని అమ్మడు మరీ ఎక్కువ కాసులు డిమాండ్ చేయడంతో, ఆ ఆఫర్ కూడా వెనక్కిపోయిందని సమాచారం.

ఇప్పుడు ఆ సినిమాలో రష్మీకి బదులు “మిర్చి” ఐట గర్ల్ హంస నందిని రాజ్ తరుణ్ తో కలిసి గంతులేయబోతోందట. రాకరాక వచ్చిన ఆఫర్ ని ఇలా పోగొట్టుకుంది రష్మీ.