టెలివిజన్ పై తన గ్లామర్ తో ఎంతో మంది ఫలోవర్స్ ని సొంతం చేసుకున్న హాట్ యాంకర్, నటి రష్మి గౌతమ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే.ఈ వైజాగ్ భామ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్ళకి పైగా అయిన రాని సక్సెస్ ఒక్క జబర్దస్త్ షో తో వచ్చింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మీపై నెటిజన్స్ చాలా ప్రశ్నలే సంధిస్తుంటారు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించే రష్మి ఎవరైనా తనని హార్డ్ గా విమర్శించిన అంతే స్థాయిలో వారి మీద విరుచుకుపడుతుంది.ఇదిలా ఉంటే రష్మీ, సుధీర్ల ల గురించి ఎప్పటికప్పుడు మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి.
వాటికి ఈ భామ చాలా సార్లు ఫుల్ స్టాప్ పెట్టింది.తాజాగా మరో సారి ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చి అతడు నాకు కేవలం మంచి ఫ్రెండ్ మాత్రమే.
మరోసారి ఈ టాపిక్ ఎత్తకండి.అయినా నా లైఫ్ పార్ట్నర్ నా శరీరమే అని వేదాంతం పలికింది.
పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనకు తోడుగా ఉండేది మన శరీరమే, అలాంటి శరీరానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ ఓ కొత్తరకం ఫిలాసఫీ చెప్పుకొచ్చింది.