సుధీర్ తో పెళ్లిపై స్పందించిన రష్మీ.. ఏం చెప్పిందంటే..?

బుల్లితెర జోడీ రష్మీ సుధీర్ లకు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.వీళ్లిద్దరూ కలిసి చేసిన షోలు, ఈవెంట్లు సక్సెస్ కావడంతో పాటు ఇద్దరికీ మంచిపేరును తెచ్చిపెట్టాయి.

 Rashmi Interesting Comments About Marriage With Sudheer, Hero Nandu, Jabardasth-TeluguStop.com

ఒకవైపు బుల్లితెరపై షోలు, ఈవెంట్లతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం రష్మీ, సుధీర్ లు ప్రయత్నిస్తూ వెండితెరపై కూడా సక్సెస్ కావడానికి కృషి చేస్తున్నారు.తాజాగా ఒక కార్యక్రమానికి రష్మీ హాజరు కాగా ఆ షోలో రష్మీకి పెళ్లికి, సుధీర్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

సుధీర్ ను పెళ్లి చేసుకుంటారా.? అని రష్మీకి ప్రశ్న ఎదురు కాగా రష్మీ ప్రస్తుతం కెరీర్ గురించి తన ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయని ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని అన్నారు.సుధీర్ ను పెళ్లి చేసుకోవాలని జనాలు కోరుకుంటారని పెళ్లి గురించి తన ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయని అన్నారు.కెరీర్ పరంగా తాను స్థిరపడాలని అనుకుంటున్నానని రష్మీ అన్నారు.

Telugu Sudheer, Rashmi-Movie

పెళ్లి కంటే లైఫ్ లో ఎన్నో ముఖ్యమైన పనులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.భవిష్యత్తుకు సరైన విధంగా ప్రణాళికలు వేసుకుని ఆ తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తానని రష్మి పేర్కొన్నారు. సినిమాల్లో సుధీర్ తో కలిసి నటించడం గురించి మాట్లాడుతూ సరైన స్క్రిప్ట్ వస్తే సుధీర్ తో కలిసి నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రష్మీ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరించడంతో పాటు ఢీ షోలో టీం లీడర్ గా ఉన్నారు.

మరోవైపు రష్మీ చాలా సినిమాల్లో నటించినా గుంటూరు టాకీస్ మినహా మిగతా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.సినిమాల్లో హీరోయిన్ గా సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం రష్మీ ఎదురు చూస్తున్నారు.

రష్మి, నందు ప్రధాన పాత్రల్లో నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా త్వరలో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube