జబర్దస్త్ షో వాళ్ళ కోసమే అంటున్న రష్మి గౌతమ్  

జబర్దస్త్ షో కేవలం అడల్ట్ కోసమే అంటున్న రష్మి గౌతమ్. .

Rashmi Goutham Says Jabardhasth Show For S Only-jabardhasth Show,rashmi Goutham,television Shows

తెలుగు టెలివిజన్ చానల్స్ లో ఎప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోయే ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది తెలుగు కమెడియన్స్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారంటే అతిశయోక్తి కాదు. అలాగే చిన్న చిన్న అవకాశాలతో, మిమిక్రీ చేసుకుంటూ బ్రతికే వారికి కూడా జబర్దస్త్ షో మంచి ఫ్లాట్ ఫాం కల్పించింది...

జబర్దస్త్ షో వాళ్ళ కోసమే అంటున్న రష్మి గౌతమ్-Rashmi Goutham Says Jabardhasth Show For Adults Only

వారు ఇప్పుడు రెండు చేతులా సంపాదించుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ షోలో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉందని, పిల్లలు చూసే విధంగా లేవని చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై చాలా మంది కేసులు కూడా పెట్టారు.

ఇదంతా ఇప్పటికి జరుగుతుంది.ఇదిలా ఉంటే తాజాగా జబర్ధస్త్ షో యాంకర్ రష్మి తన అభిప్రాయం మరోసారి స్పష్టం చేసింది. జబర్దస్త్ షో పై కాంట్రవర్సీలు మీరు చేస్తున్నారు.

మేము కేవలం ఎంటర్టెన్మెంట్ అందించాలనుకుంటున్నాం. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మీ అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక ప్రైమ్ షో అనేది అడల్ట్స్ కోసమే.

వారికంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఏది తీసుకోవాలి. ఏది తీసుకోవద్ద అనే దానిపై వారికో అవగాహన ఉంటుంది.

అందుకే తమ షోపై అదే పనిగా విమర్శలు చేయడం ఆపేస్తే మంచిది అంటూ ట్విట్టర్ లో చెప్పుకొచ్చింది.