చూడలేకుంటే కళ్లు మూసుకో లేదంటే..!

జబర్దస్త్‌పై నెటిజన్స్‌ కామెంట్స్‌ చేయడం ఎప్పుడు చూస్తూనే ఉంటాం.బూతు కామెడీ షో అని, యాంకర్స్‌ మరీ హద్దులు మీరి గ్లామర్‌గా కనిపిస్తున్నారు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జబర్దస్త్‌పై కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు.

 Rashmi Give The Replay To Netizens-TeluguStop.com

ఇప్పుడు మరోసారి జబర్దస్త్‌పై ఒక వ్యక్తి అసభ్యకరంగా కామెంట్స్‌ చేశాడు.యాంకర్‌ రష్మి గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు.

దాంతో రష్మి చాలా సీరియస్‌గా స్పందించింది.ఆమె అతడికి తగిన బుద్ది చెప్పింది అంటూ కొందరు ఆమె తీరుపై ప్రశంసలు కురిపించారు.

Telugu Anchors Tattos, Jabardasth, Netizens Rashmi, Rashmi Gautham-Movie

అసలు విషయం ఏంటీ అంటే… జబర్దస్త్‌ బూతు షో అని, శరీరం చూపిస్తూ యాంకర్స్‌ డాన్స్‌లు చేస్తున్నారు అంటూ కామెంట్స్‌ చేశాడు.అతడి కామెంట్‌కు రష్మి గౌతమ్‌ సీరియస్‌గా స్పందించింది.జబర్దస్త్‌ అనేది ఒక సక్సెస్‌ ఫుల్‌ కామెడీ షో.ఎంతో మంది దీన్ని చూస్తున్నారు.నువ్వు ఒక్కడివి ఈ షోను విమర్శించడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు.అయినా కూడా జబర్దస్త్‌ను చూడమంటూ నిన్ను ఎవరు ఒత్తిడి చేయడం లేదు.చేతులు కట్టేసి మరీ టీవీ ముందు నిన్ను ఎవరు కూర్చోబెట్టలేదు అంది.

Telugu Anchors Tattos, Jabardasth, Netizens Rashmi, Rashmi Gautham-Movie

నీకు నచ్చని విధంగా యాంకర్స్‌ కనిపిస్తే కళ్లు మూసుకో.అసలు షోనే నచ్చకుంటే ఛానెల్‌ మార్చుకో.అంతే తప్ప చాలా మంది అభిమానించే షోపై నీవు అనవసర కామెంట్స్‌ చేయడం పద్దతి కాదంటూ అతడికి చురకలు అంటించింది.

అయితే అతడి విమర్శలకు రష్మి గౌతమ్‌ స్పందించడంను కొందరు తప్పుబడుతున్నారు.అలాంటి వారు ఎంతో మంది విమర్శలు చేస్తారు.చేస్తూనే ఉంటారు.వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు మీ పని చేసుకోండి అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.

జబర్దస్త్‌ను తాము ఎప్పటికి అభిమానిస్తూనే ఉంటామంటూ కొందరు కామెంట్స్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube