రష్మీని మోసం చేసేందుకు ప్రయత్నించిన నెటిజన్‌... సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది  

  • జబర్దస్త్‌ యాంకర్‌గా మంచి స్టార్‌డం దక్కించుకున్న రష్మీ హీరోయిన్‌గా కూడా మంచి జోరు మీదున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు వరుసగా షోలు, ప్రమోషన్స్‌ ఇలా వరుసగా ఏదో ఒక కార్యక్రమంతో బిజీగానే ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం రష్మీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను గురించి అందులో పోస్ట్‌ చేస్తుంది. కొందరి ప్రశ్నలకు సమాధానలు చెబుతూ వస్తుంది. తాజాగా ఒక వ్యక్తి రష్మీని మోసం చేసేందుకు ప్రయత్నించాడు.

  • తాను ఒక పీఆర్‌ అని, మీతో ఒక ప్రమోషన్‌ కార్యక్రమం చేయించాలని భావిస్తున్నాము. మీ నాన్నగారి నెంబర్‌ నా వద్ద ఉండేది, అది మిస్‌ చేసుకున్నాను. మీరు ఆయన నెంబర్‌ ఇస్తే మాట్లాడతాను అంటూ ఆమెను కోరాడు. అతడు నెంబర్‌ అడిగిన ఉద్దేశ్యం రష్మీకి అర్థం అయ్యింది. అసలు రష్మీ వాళ్ల నాన్న గారు ఆమెకు 12 ఏళ్ల వయసు ఉన్న సమయంలోనే చనిపోయాడు. ఆ సమయంలో ఆయన నెంబర్‌ ఈయన వద్ద ఉండేది, అది మిస్‌ అయ్యింది అనగానే రష్మీకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో తీవ్ర స్థాయిలో అతడిపై విరుచుకు పడింది.

  • Rashmi Gautham Strong Responds To The Fake PR Agency For Tricking-Pr Rashmi Father Number Tricking

    Rashmi Gautham Strong Responds To The Fake PR Agency For Tricking

  • మీలాంటి వారి వల్లే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. మీలాంటి వారు అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్న కారణంగానే ఇతరుల విషయంలో కూడా తప్పుడు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మీరు ఏ ఉద్దేశ్యంతో నెంబర్‌లు అడుగుతారో మాకు తెలుసు. అమ్మాయిలను వేదించడానికి ఇది ఒక ప్రత్యేకమైన పద్దతి. మీరు మా నాన్న గారి నెంబర్‌ ఉద్దేశ్యంతో నా నెంబర్‌ సంపాదించి దాంతో నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు అంటూ రష్మీ సీరియస్‌గా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటిది మరోసారి రిపీట్‌ అయితే సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.