ఏకంగా ముఖ్యమంత్రులపై ట్వీట్ చేసిన టాలీవుడ్ హాట్ యాంకర్....

టాలీవుడ్ లో హాట్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు పలురకాల ఈవెంట్లు, షోలు నిర్వహిస్తూ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది.

 Rashmi Gautam Tweet Goes Viral In Social Media-TeluguStop.com

మరోపక్క అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తూ అప్పుడప్పుడు తన అందాలవిందుతో ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే ఈ అమ్మడు మధ్యకాలంలో ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

తాజాగా ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులపై వ్యంగంగా ట్వీట్ చేసి పార్టీ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తూ ఈ వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఓ చిన్నపాటి పారాసిటమాల్ గోళీ వేసుకుంటే తగ్గిపోతుందని పలు వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ బాగా తెలిసిందే.

అయితే ఈ వ్యాఖ్యలను అనుకరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అచ్చంగా ఇలాంటి వ్యాఖ్యలు మీడియా ముందు చేశారు.దీంతో కొందరు నెటిజనులు ఈ వ్యాఖ్యలను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై రష్మి గౌతమ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా  ద్వారా స్పందించింది.ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిన్నపాటి పారాసిటమాల్ గోలి వేసుకుంటే కరోనా వైరస్ తగ్గిపోతుందని అంటూ ప్రజలకు ధైర్యం చెబుతున్నందుకు హ్యాట్సాఫ్ అంటూ పోస్ట్ చేసింది.

Telugu Hotanchor, Rashmigautam-Movie

దీంతో కొందరు నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రష్మి గౌతమ్ చేసినటువంటి వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.అంతేగాక ప్రస్తుతం కరోనా వైరస్ గురించి ప్రజలు భయపడుతున్న టంతో వారికి ధైర్యం చెప్పేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇలా ఆలోచించి ఉండొచ్చు అని దానికి ఇంత వేగంగా పూర్తి చేయాలంటూ రష్మి గౌతమ్ ని ఆడిపోసుకుంటున్నారు.అంతేగాక ఎవరైనా మంచి పనులు చేస్తే వారికి అండగా నిలబడాలి ఉంది పోయి ఇలా వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ కించపరచకూడదు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.మరి ఈ వ్యాఖ్యలు నెటిజన్ల వ్యాఖ్యలపై రష్మి గౌతమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube