దారినపోయే అతనితో రష్మీ సెల్ఫీ.. అభిమానులకు సూపర్ మెసేజ్!

సాధారణంగా బుల్లితెర సెలబ్రిటీల లేదా వెండితెర సెలబ్రిటీలు కనిపించినప్పుడు వారిని కలవడానికి, వారితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఆరాటపడుతుంటారు.ఈ క్రమంలోనే అభిమానులు చూపించే అభిమానం కొంతమేర సెలబ్రిటీలకు ఇబ్బంది కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు అందుకోసమే చాలామంది సెలబ్రిటీలు బయటకు వచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

 Rashmi Gautam Shares Selfie With Unknown Biker Without Helmet Rashmi Gautam, Sel-TeluguStop.com

అదే విధంగా ఎవరైనా స్టార్ సెలబ్రిటీ రోడ్డుపై వెళ్తున్నారంటే చాలా మంది అభిమానులు వారి ప్రయాణించే కారును వెంబడిస్తూ ఉంటారు.

ఒక స్టార్ సెలబ్రిటీ ముక్కు మొహం తెలియని వారితో సెల్ఫీలు దిగాలంటే కొంచెం కష్టమే అని చెప్పవచ్చు.

కానీ బుల్లితెర యాంకర్ గా ఎంతో క్రేజ్ ఉన్న రష్మీ మాత్రం దారినపోయే ఓ దానయ్యతో సెల్ఫీ దిగి సమాజానికి అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది.యాంకర్ రష్మి కారులో ప్రయాణం చేస్తుండగా రోడ్డుపై ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా దర్జాగా బండి నడుపుతూ కనిపించాడు.

ఈ క్రమంలోనే సదరు వ్యక్తి సెల్ఫీలో పడే విధంగా రష్మీ సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు.

Telugu Fans, Jabardasth, Rashmi, Rashmi Gautam, Selfie, Tollwood-Movie

ఈ సెల్ఫీ ను రష్మీ పోస్ట్ చేస్తూ హెల్మెట్ లేకుండా బండి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తో సెల్ఫీ సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే రష్మి సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు.

అదేవిధంగా మూగజీవాల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను కూడా ఎన్నోసార్లు బయటపెట్టింది.అదే విధంగా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారిని ఆదుకోవడానికి కూడా రష్మీ ముందుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube