నో క్లీవేజ్ షో.. నో ఎక్స్ పోజింగ్ అంటున్న రష్మీ.. కారణం అదేనా?

యాంకర్ రష్మి గౌతమ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన అందాలతో, తన యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.

 Rashmi Gautam Says No Skin Show In Bomma Blackbuster Movie-TeluguStop.com

ప్రస్తుతం బుల్లితెర లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.బుల్లితెర లోని పలు షోలలో బాగా బిజీగా మారింది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇక తన అందాలతో ఫోటోలను షేర్ చేస్తూ యువతను బాగా ఆకట్టుకుంటుంది.

 Rashmi Gautam Says No Skin Show In Bomma Blackbuster Movie-నో క్లీవేజ్ షో.. నో ఎక్స్ పోజింగ్ అంటున్న రష్మీ.. కారణం అదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మీ బుల్లి తెరకు ముందు వెండి తెరలో నటించిన విషయం చాలా వరకు ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ తాను తెచ్చుకున్న గుర్తింపు మాత్రం జబర్దస్త్ షో నుండి అని చెప్పవచ్చు.

ఇక ఈ షో తర్వాత వెండితెర లో మళ్లీ అడుగు పెట్టిన ఈ బ్యూటీ అంత సక్సెస్ అందుకోలేదు.కానీ మంచి కథతో అవకాశం వస్తే నటిస్తోంది రష్మీ.

ఇదిలా ఉంటే తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా లో నటించిన సంగతి తెలిసిందే.ఇక నో క్లీవేజ్ షో, నో ఎక్స్ పోజింగ్ అంటూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

ఈ సినిమా సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది రష్మీ.తాను నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా అన్ని మసాలాలు దట్టించి ప్రేక్షకుల ముందుకు సిద్ధంగా ఉందని తెలిపింది.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమా ముందుకు తీసుకు రాలేకపోయామంటూ.త్వరగా సినిమాలు విడుదల చేసే అవకాశం కూడా లేదని తెలిపింది.అంతే కాకుండా పెద్ద పెద్ద సినిమాలే ఆగిపోయాయని.అందులో మా సినిమా ఎంత అని తెలిపింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియకుండా ఉందంటూ, థియేటర్ లో రిలీజ్ చేయాలని సినీ బృందం ఆలోచనలో ఉందని తెలిపింది.

Telugu Bomma Blackbuster, Rashmi Gautam, Skin Show, Trolls-Movie

కానీ ఓటీటీ లో వస్తుందా లేదా థియేటర్ లో వస్తుందా ఖచ్చితంగా చెప్పలేం అంటూ.అంతవరకు వేచి ఉండాల్సిందే అంటుంది.ఇక ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ చేశాను అంటూ దాన్నిబట్టి సెక్సీ, అది.ఇది అంటూ తెగ కామెంట్లు చేశారని.కానీ ఈ సినిమాలో తన పాత్ర డీగ్లామర్ పాత్ర అని తెలిపింది.

ఇక ఇందులో క్లీవేజ్ షో, నడుము చూపించడాలు ఉండవు అంటూ.పాత్ర కోసం తను వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయని.

అంతేకాకుండా గ్లామర్ కు దూరంగా ఉండే పాత్ర అని తెలిపింది.

ఇక ఎప్పుడు తనను గ్లామర్ విషయంలో ట్రోల్ చేసేవాళ్ళు.

యాక్టింగ్ కు స్కోప్ ఉన్న సినిమాలు చెయారా అని అడుగుతున్నారని, అందుకే ప్రస్తుతం చాలెంజింగ్ పాత్రలో నటించానని తెలిపింది.ఇక తనపై విమర్శలు చేసే వారికి ఈ సినిమా చేశాను అంటూ.

తప్పకుండా ఈ సినిమా చూడాలని తెలిపింది.

#Trolls #Skin Show #Rashmi Gautam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు