యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి.. అందుకే అలా అవుతున్నారంట.! ట్విట్టర్ లో అభిమాని అడిగితే అసలు నిజం.!

సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసి సరైన ఛాన్సులు రాక బుల్లితెరవైపు వచ్చినవారెందరో.వారిలో ఒకరే రష్మి.

 Rashmi Gautam Says About Her Health Problem To The Fan-TeluguStop.com

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా దూసుకుపోతున్న రష్మి.ఒకప్పుడు సినిమా ఛాన్సుల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.

చిన్న చిన్న పాత్రలు చేసి సరైన అవకాశాలు రాక జబర్దస్త్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది.యాంకరింగ్ కి గ్లామర్ సొగసులద్దిన వారిలో అనసూయ,రష్మి ముందుంటారు.

రష్మి ఏం చేసినా,ఏం మాట్లాడిన స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటుంది.

రష్మీ కి ట్విట్టర్ లో ఓ అభిమాని ఇలా ట్వీట్ చేసారు.”రష్మీగారు.ఇటీవల మీరు ఓ ఈవెంట్‌లో చీరలో కనిపించారు.అందులో మీరు చాలా లావుగా ఉన్నారు.30 ఏళ్ల వయసులో మీరు సన్నగా నాజూకుగా ఉండాలి.కాబట్టి శరీరాకృతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని అభిమాని హెచ్చరించారు.” రష్మీగారు త్వరగా మీ కెరీర్ ముగిస్తే భరించలేము.నేను చెప్పే పాయింట్‌ను పరిగణనలోకి తీసుకోండి.

అభిమాని చేసిన రిక్వెస్ట్‌పై రష్మీ స్పందించారు.తన బరువు, లావుకు కారణమైన పరిస్థితులను రష్మీ వివరించారు.లావైతే నాకు ఆఫర్లు తగ్గిపోతాయి.

మీరు సూచించిన ప్రకారం నా ఆహార అలవాట్లు, తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్త వహిస్తాను అని చెప్పారు.అంతేకాకుండా తన లావుకు కారణం రుమాటిజం.

ఈ వ్యాధికి గురయ్యానని 12వ ఏటనే తెలిసింది.అప్పటి నుంచి నేను ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాను అని రష్మీ వెల్లడించారు.

ఈ వ్యాధి వల్ల బరువు, లావు విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.దానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకొంటున్నాను.

అభిమానులు ఆందోళన చెందవద్దు అని పేర్కొన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube