అలాంటి సినిమాలకి దూరం కావాలని అనుకుంటున్న రష్మి గౌతమ్

నటిగా చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా టర్న్ తీసుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రష్మి గౌతమ్.వైజాగ్ అమ్మాయి అయిన నార్త్ ఇండియన్ బ్యాగ్రౌండ్ ఉన్న రష్మిక తనకి వచ్చిరాని తెలుగుతో యాంకరింగ్ చేసిన హాట్ కాస్ట్యూమ్స్ తో స్టేజ్ సందడి చేస్తూ షోకి అదనపు ఆకర్షణ తీసుకురావడంతో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది.

 Rashmi Gautam Not Interested Focus On Low Budget Movies, Jabardasth Comedy Show,-TeluguStop.com

జబర్దస్త్ షోకి ముందు రామరామ కృష్ణకృష్ణ, ప్రస్థానం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన రాని గుర్తింపు ఈ షోతో వచ్చింది.ఇక ఈ అమ్మడు చేసే గ్లామర్ షోకి కుర్రకారు భాగ కనెక్ట్ అయిపోయారు.

దీంతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.అందులో కంప్లీట్ బోల్డ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.

అయితే ఆ పాత్రలో రష్మి పెర్ఫార్మెన్స్ ని కాకుండా ఆమె బోల్డ్ నెస్ కి ఎక్కువ మంది దర్శక, నిర్మాతలు కనెక్ట్ అయ్యారు.

దీంతో వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి.

ఆమెని లీడ్ హీరోయిన్ గా పెట్టుకొని చాలా మంది కొత్త హీరోలు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.రెమ్యునరేషన్ భాగా గిట్టుబాటు అవుతూ ఉండటంతో ఆమె కూడా కథ గురించి పెద్దగా ఆలోచించకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.

అయితే ఆ సినిమాల కారణంగా నటిగా రష్మి గౌతమ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెప్పాలి.అయితే ప్రస్తుతం టెలివిజన్ లో మాత్రం ఈ అమ్మడు భాగా బిజీ అయ్యింది.

దీంతో రష్మి తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.ఇకపై సినిమాల విషయంలో ఏది పడితే అది ఒప్పుకోకూదదని ఫిక్స్ అయ్యింది.

గతంలో చేసినట్లు కనీసం కథబలం లేని పాత్రలు వస్తే అస్సలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది.తన పాత్ర ప్రాధాన్యత బట్టి సినిమాలు ఎంపిక చేసుకోవాలని భావిస్తుంది.

ఇప్పుడు టెలివిజన్ పై ఎలాగూ బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అనవసరమైన సినిమాల జోలికి వెళ్లి ఇమేజ్ పాడుచేసుకోకుండా ఉండటమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube