బాలయ్య సినిమాలో జబర్దస్త్ హాట్ బ్యూటీ

బాలయ్య బాబు కొత్త సినిమా ఈ రోజుప్రారంభమైంది.బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది.

 Rashmi Gautam In Balakrishna Boyapati Movie-TeluguStop.com

ఇక ఈ సినిమా కూడా బోయపాటి గత సినిమాలు తరహాలోనే బాలయ్యకి సరిపోయే మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాని ప్రారంభోత్సవం జరుపుకోగా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర కాస్టింగ్ ఇంకా ఫైనల్ కాకపోయినా ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తుంది.

జబర్దస్త్ తో యాంకర్ గా టర్న్ ఇచ్చిన రష్మి తన ఇమేజ్ ని క్యాష్ చేసుకునే క్రమంలో వరుసగా సినిమాలు చేస్తుంది.

అయితే ఆమె ఎక్కువగా చిన్న సినిమాలు చేస్తూ ఉండటంతో, కేవలం డబ్బుల కోసమే అన్నట్లు ఎలాంటి కంటెంట్ లేని కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.దీంతో రష్మి హీరోయిన్ గా నటించిన సినిమాలు గుంటూరు టాకీస్ తర్వాత ఏ ఒక్క సినిమా ఎవరికి గుర్తుకురాదు.

అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఆఫర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో ఓ ఇంపార్టెంట్ పాత్ర కోసం రష్మిని ఫైనల్ చేసినట్లు సమాచారం.

ముందుగా ఈ పాత్ర కోసం అనసూయని అనుకున్న కూడా ఆమె డేట్స్ దొరకకపోవడంతో బోయపాటి రష్మిని ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తుంది.మరి ఈ సినిమా జబర్దస్త్ పాపకి ఎంత వరకు క్రేజ్ తీసుకొస్తుందో అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube