Rashmi Sudheer : రష్మీ ఇలాంటి ఫోటోషూట్స్ చెయ్యొద్దు.. సుధీర్ అన్న ఫీల్ అవుతాడు!

Rashmi Dont Do Such Photoshoots Sudhir Will Feel Like That Rashmi, Photoshoots, Sudhir , Jabardasth , Dhee Show , Maldives, Gaalodu, Tollywood

రష్మీ, సుధీర్ ఈ పేర్లు వినగానే వెంటనే మనకు గుర్తుకొచ్చే షో జబర్దస్త్.ఎందుకంటే ఈ జంట ఈ జబర్దస్త్ షో తోనే అందరి హృదయాలను గెలుచుకున్నారు.

 Rashmi Dont Do Such Photoshoots Sudhir Will Feel Like That Rashmi, Photoshoots-TeluguStop.com

ఈ జబర్దస్త్ షోలో రష్మీ యాంకర్ గా అడుగుపెడితే సుధీర్ కమెడియన్ గా అడుగు పెట్టాడు.ఇక యాంకర్ గా రష్మీ తనకంటూ ఒక గుర్తింపు అందుకోగా.

కమెడియన్ గా సుడిగాలి సుధీర్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.అయితే ఈ షోలో వీరిద్దరికీ మంచి బాండింగ్ ఉండేది.

నిజానికి వీరిద్దరిని చూస్తే ప్రేమలో ఉన్నారా అన్నట్లు కనిపించేది.ఎందుకంటే వీరిద్దరూ అలా ఉండేది కాబట్టి.

చాలాసార్లు సుడిగాలి సుధీర్ రష్మీ ని ప్రపోజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి.ఇక రష్మీ కూడా సుధీర్ మాటలకు వెంటనే కరిగిపోయేది.

ఇక ఇద్దరు కలిసి చేసే డ్యాన్సులు మాత్రం మామూలుగా ఉండేది కాదు.

అంతేకాకుండా సుధీర్ తన ప్రేమ డైలాగులతో రష్మీ నే కాకుండా ప్రతి ఒక్క అమ్మాయిని పడేశాడు.

గతంలో మల్లెమాల వీరిద్దరికి జబర్దస్త్ వేదికపై పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఢీ డాన్స్ షోలో కూడా ఈ జంట బాగా సందడి చేశారు.

ఇక వీరి జోడి బాగా ఉండటంతో వీరి అభిమానులు కూడా వీరిని జంటగానే చూశారు.ఇక వీరి పేర్లపై ఫ్యాన్ పేజీ క్రియేట్ చేసుకొని వారికి సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను పెడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇప్పటికీ వీరిద్దరిని జంటగా చూడాలి.అంతేకాకుండా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.గతంలో వీరిద్దరికీ పెళ్లి అయిందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని ఫోటోలను ఎడిట్ చేసి బాగా వైరల్ చేశారు వీరి ఫ్యాన్స్.

కానీ ఈమధ్య ఈ జంట దూరంగా ఉంటున్నారు.కారణం ఏంటంటే సుడిగాలి సుధీర్ బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు.వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సుధీర్ వెండితెరపైనే కనిపిస్తున్నాడు.

ఇక రష్మీ కూడా సినిమాలలో నటిస్తూనే షో లలో యాంకర్ గా కొనసాగుతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈమధ్య రష్మీ గ్లామర్ అందాలను బాగా ఆరబోస్తుంది.

ఏకంగా బికినీలతో కనిపిస్తూ బాగా రచ్చ చేస్తుంది.ఇటీవలే ఆమె మాల్దీవులకి వెళ్ళగా అక్కడ బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని పంచుకుంటుంది.అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో ఆమె స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపించింది.అంతే కాకుండా వాటర్ లో ఉండి కొన్ని ఫుడ్ ఐటమ్స్ దగ్గర పెట్టుకొని ఫోటోలు దిగింది.ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వడంతో.

తనను ఆ గెటప్ లో చూసి అందరూ షాక్ అవుతున్నారు.ముఖ్యంగా సుధీర్ ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

దీంతో ఓ నెటిజన్ రష్మీ ఇలాంటి ఫోటోషూట్ చేయొద్దు అంటూ.సుధీర్ అన్న చూస్తే చాలా ఫీల్ అవుతాడు అంటూ కామెంట్ పెట్టారు.

ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube