ధైర్యం చేసి ఇన్నాళ్ళకి రష్మీకి ప్రపోజ్ చేసిన సుధీర్...

టాలీవుడ్ బుల్లితెర పై రష్మీ సుధీర్ జోడికి ఎంత మంచి ఫేమ్ ఉందో చెప్పనవసరం లేదు.అంతేగాక వీరిద్దరూ తాజాగా నటిస్తున్న టువంటి ఎక్స్ ట్రా జబర్దస్త్, మరియు డీ జోడి  షోలు టిఆర్పి రేటింగులు పరంగా దూసుకుపోతున్నాయి.

 Rashmi And Sudigali Sudher Love News-TeluguStop.com

అయితే ఇక్కడ కంటెస్టెంట్లు చేసే పర్ఫామెన్స్ చూసే వాళ్ళు కొందరయితే కేవలం రష్మీ, సుధీర్ పర్ఫామెన్స్ కోసమే కొందరు ఈ షోలను చూస్తుంటారు.

Telugu Jabardasth, Rashmisudigali-Movie

అయితే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి సంబంధించినటువంటి ప్రోమో నెట్ లో వైరల్ అవుతోంది.అయితే ఇందులో ఓ స్పెషల్ ఉంది.గత నాలుగేళ్లుగా సుధీర్ రష్మీ మధ్య ఉన్న ప్రేమాయణం ఎట్టకేలకు కంచెకు చేరనుంది.

అయితే ఫిబ్రవరి 14వ తారీఖున ప్రసారమయ్యేటువంటి ఎపిసోడ్ లో సుడిగాలి సుదీర్ గ్లామర్ డాల్ రష్మి గౌతమ్ కి ప్రపోస్ చేయనున్నాడు.అంతేగాక వీరిద్దరూ కలిసి వెన్నెలవే వెన్నెలవే అంటూ రొమాంటిక్ లవ్ సాంగ్ కూడా చేశారు.

దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల సరసన నిలుస్తోంది.

అంతేగాక ఈ ప్రోమో యూట్యూబ్ లో విడుదల చేసిన నాలుగు గంటల లోపే దాదాపుగా 3 మిలియన్లు పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు జనాల్లో రష్మీ సుధీర్ ల జోడికి ఎంత క్రేజ్ ఉందో అని.అయితే గతంలో కూడా ఇలాంటి వీడియోలు చాలానే వచ్చినప్పటికీ రష్మి సుదీర్ ప్రేమ గురించి స్పష్టత ఇవ్వలేదు.దాంతో సుధీర్ తో పాటు సుధీర్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు రష్మీ సుధీర్ కి లవ్ ఓకే చెబుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే అసలు సుదీర్ నిజంగానే రష్మికి ప్రపోజ్ చేశాడా లేదా అనేది తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube