రష్మీ సుధీర్ ల క్రేజ్ తగ్గింది. అందుకే వర్ష - ఇమ్మానియేల్ ని హైప్ చేస్తున్నారు.

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన  ఈ టీవీ ఛానల్ లో ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే చాలా మంది కమెడియన్లు సినిమా పరిశ్రమలో బాగా పాపులర్ అయ్యారు.అయితే ఇందులో ముఖ్యంగా కామెడీ స్కిట్లు ఒక ఎత్తయితే సుడిగాలి సుధీర్ మరియు బ్యూటిఫుల్ యాంకర్ రష్మీ ల మధ్య కెమిస్ట్రీ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

 Rashmi And Sudheer Craze Down, Rashmi Gowtham, Telugu Anchor And Heroine, Sudhee-TeluguStop.com

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొందరు అభిమానులు చర్చించుకుంటున్నారు.కాగా తాజాగా ఈ విషయంపై పలు జబర్దస్త్ కామెడీ స్కిట్లలో పంచులతో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ కమెడియన్ మహిధర్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ విషయంపై పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా రష్మీ సుధీర్ ల జోడీపై వినిపిస్తున్న పుకార్ల గురించి స్పందిస్తూ కేవలం ప్రజలను నవ్వించడానికి మాత్రమే రష్మీ సుధీర్ లు అలా తెరపై నటిస్తారని అంతేతప్ప వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమా, గీమా వంటివి లేవని కూడా స్పష్టం చేశాడు.అయితే ఈ మధ్య లవ్ ఎఫైర్, నటీనటుల మధ్య  కెమిస్ట్రీలు ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాయని అందువల్ల కొందరు దర్శకనిర్మాతలు కావాలనే ఇలాంటి జోడిలను క్రియేట్ చేస్తున్నారని కూడా తెలిపాడు.

ఇటీవల కాలంలో రష్మీ సుధీర్ ల జంటకి క్రేజ్ తగ్గిపోయిందని అందువల్లనే వర్ష – ఇమ్మానియేల్ లను హైలెట్ చేస్తున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కానీ నిజ జీవితంలో వర్ష – ఇమ్మానియేల్ కనీసం ఒకరికొకరుతో సరిగ్గా మాట్లాడుకోరని కూడా  అని స్పష్టం చేశాడు.

ఏదేమైనప్పటికీ రష్మీ సుధీర్ లు అలాగే వర్ష – ఇమ్మానియేల్ జోడీలు బుల్లితెర జబర్దస్త్ కే హైలెట్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే కంటెంట్ తో సంబంధం లేకుండా తనదైన శైలిలో పంచులు పేలుస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది పై కూడా మహీధర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఈ మధ్యకాలంలో కమెడియన్ హైపర్ ఆది ఎక్కువగా తన టీంలో పని చేసేటువంటి కమెడియన్లను టార్గెట్ చేస్తూ వారు చేసిన తప్పులను అదేపనిగా ఎత్తి చూపుతూ అప్పుడప్పుడు హేళన చేస్తుంటాడని యాంకర్ అడిగింది.దీంతో మహీధర్ స్పందిస్తూ హైపర్ ఆది కేవలం ప్రేక్షకులను నవ్వించడం కోసం మాత్రమే తన టీంలో పనిచేసే కమెడియన్లపై పంచులు పేలుస్తాడని అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా ఎలాంటి కామెంట్లు చేయడని స్పష్టం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube