నేనేం బాధపడలేదు, అవి ఫేక్‌ న్యూస్‌

విజయ్‌ దేవరకొండ నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ నటించారు.ముగ్గురు హీరోయిన్స్‌లో మెయిల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన హీరోయిన్‌ రాశిఖన్నా అనే విషయం తెల్సిందే.

 Rashi Khanna Comments On World Famous Lover Rashikhanna, Vijaydevarakonda, World-TeluguStop.com

సక్సెస్‌ లేక ఆఫర్లు తగ్గుతున్న సమయంలో వచ్చిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంతో మళ్లీ బిజీ అవ్వడం ఖాయం, ఈ సారి స్టార్‌ హీరోల దృష్టిలో పడటం ఖాయం అనుకుంది.అందుకే ఆ సినిమా కోసం కాస్త శృతిమించిన శృంగార సీన్స్‌ లో నటించడంతో పాటు కష్టపడి నటించింది.

ఆ సినిమా దారుణ పరాజయం పాలయిన విషయం తెల్సిందే.

ఆ సినిమా గురించి తాజాగా రాశిఖన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మళ్లీ అలాంటి సినిమాల్లో నటించను, అలాంటి సీన్స్‌లో చేయను అంటూ కామెంట్స్‌ చేసింది.

నేను ఆ సినిమాలో నటించినందుకు ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అవి కాస్త వైరల్‌ అవ్వడంతో ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆమెపై అసహనం వ్యక్తం చేసినట్లుగా ఉన్నారు.

అందుకే వెంటనే స్పందించింది.తన ఉద్దేశ్యం అది కాదని, అసలు తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు అంటూ మాట మార్చే ప్రయత్నం చేసింది.

Telugu Rashikhanna, Tollywood, Lover-Movie

నేను మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాను ఎంజాయ్‌ చేస్తూ చేశాను. ప్రతి సినిమా కూడా నాకు కొత్త అనుభవంను నేర్పించింది.కనుక నేను ఏ సినిమాను తక్కువ చేసి మాట్లాడటం కాని, ఏ సినిమాను కూడా తక్కువ చేసి చూడటం కాని చేయలేదు. నేను ఇప్పటి వరకు చేసిన ఏ సినిమా విషయంలో కూడా బాధపడలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్త నిజం కాదంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. కాని ఆమె మాట్లాడినట్లుగా ఇప్పటికే వైరల్‌ అవ్వడంతో ఈ వివరణను ఎవరు పట్టించుకోవడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube