యావత్ టీ20ల్లోనే భయంకరమైన రికార్డ్ ఇది... ఎలా సాధ్యపడిందతనికి?

టీ20 క్రికెట్( T20 Cricket ) అంటేనే ధనాధన్ ఫార్మాట్.ఇలాంటి చోట దాదాపుగా బ్యాటర్ల హవానే నడుస్తుంది.

 Rashid Khan Bowls 100 Consecutive Deliveries Without Conceding A Boundary In T20-TeluguStop.com

అయితే అప్పుడప్పుడు ఈ ఫార్మాట్ లో కొందరు బౌలర్లు తమదైన శైలిలో చిచ్చర పిడుగుల్లాగా చెలరేగుతుంటారు.బ్యాటర్లను తమ క్లిష్టమైన బంతులతో కష్టాల్లోకి నెడతారు.

ఈ లిస్టులో కొంతమంది బౌలర్లు ఉన్నప్పటికీ అందరి కన్నా ముందు వరుసలో వున్నవాడు మాత్రం అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్( Afghan Captain Rashid khan ).అవును, టీ20 ఫార్మాట్ లో రషీద్ ఖాన్ ఎంతటి డేంజరస్ బౌలరో మీకు తెలియంది కాదు.

అతని బౌలింగ్లో పరుగులు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.స్టార్ బ్యాటర్( Star Batter ) అయినా అతని బౌలింగ్( Bowling ) కి తడబడతారు.రషీద్ ఖాన్.అయితే తన బౌలింగ్ విషయంలో రోజు రోజుకీ రాటుదేలిపోతున్నాడు.అద్భుతమైన బంతులతో బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు.ఈ క్రమంలో తాజాగా మనోడు ఓ సూపర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇపుడు ఈ స్పిన్ మెజిషీయన్ అద్భుతమైన బౌలింగ్ తో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును టీ20 క్రికెట్ ఫార్మెట్లో క్రియేట్ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో బౌండరీ ఇవ్వకుండా వరుసగా 100 బంతులు వేసిన ఘనతను సాధించాడు.

మునుపెవ్వరూ ఇలాంటి రికార్డుని నెలకొల్పలేదు.

ఇకపోతే, పాకిస్తాన్ తో జరుగుతున్న 3వ టీ20లో ఈ రికార్డుకు కాస్త బ్రేక్ పడ్డట్టు అయింది.రషీద్ ఖాన్ 106వ డెలివరీకి పాకిస్తాన్ బ్యాటర్ ఆయుబ్ సిక్సర్( Sixer ) బాదడంతో ఆ రికార్డుకు బ్రేక్ పడింది.అయినప్పటికీ రషీద్ సాధించిన ఘటన సాధారణమైనది కాదు.

ఇక మునుపు కూడా ఈ రికార్డుని ఎవ్వరు బ్రేక్ చేయరని క్రికెట్ పండితులు చెబుతున్నారు.ఇక, రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని అఫ్గానిస్తాన్( Afghanistan ) దుమ్మురేపింది.మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించింది.2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.అఫ్గాన్ ను లైట్ గా తీసుకుని దాయాది దేశం బొక్కబోర్లాపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube