బన్నీ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన రాశి  

Rashi Khanna Will Act With Allu Arjun-

అల్లు అర్జున్ సరసన హీరోయిన్ రాశి ఖన్నా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.అదేంటి బన్నీ నెక్స్ట్ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ కదా మళ్లీ రాశి ఖన్నా ఏంటి అని అనుకుంటున్నారా.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న బన్నీ, మరోపక్క వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కూడా మరో చిత్రం చేసేందుకు కమిట్ అయినట్లు తెలుస్తుంది..

Rashi Khanna Will Act With Allu Arjun--Rashi Khanna Will Act With Allu Arjun-

ఈ నేపథ్యంలో ఆ చిత్ర స్క్రిప్ట్ ప్రకారం రాశిఖన్నా అయితే బన్నీ పక్కన బాగుంటుంది అని వేణు శ్రీరామ్ ఆమెకు సంప్రదింపులు చేశారట.టాలీవుడ్ లో 2014 లో ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం తో పరిచయమై పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశిఖన్నా.ఆమె లో ఒక్క నటే కాదు మంచి సింగర్ కూడా ఉంది అన్న విషయం తెలిసిందే.అయితే ఈ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రాశి ఖన్నా అయితే బాగుంటుంది అని ఆమెను సంప్రదించారు.అయితే ఆ ముద్దు గుమ్మ కూడా బన్నీ పక్కన ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుందట.

‘ఐకాన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ లుక్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా ఏప్రిల్ 8 వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే..

అయితే డిఫెరెంట్ టైటిల్ కావడంతో మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఐకాన్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.ప్రస్తుతం రాశి వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ‘వెంకీ మామ’ సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది.అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో మరో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.ఇక ఇప్పుడు బన్నీ సినిమాలో కూడా అవకాశం రావడం తో ఇక ఈ అమ్మడు స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.