ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన రాశి ఖన్నా

సెలబ్రిటీలపై ఎప్పుడు కూడా మీడియాలో ఏవో ఒక రూమర్స్ వస్తూ ఉంటాయి.ముఖ్యంగా బాలీవుడ్ లో హీరోయిన్ ఎక్కువగా నైట్ పార్టీలకి అలవాటు పడి ఉంటారు.

 Rashi Khanna Gives Clarity On Rumors, Tollywood, Kollywood, South Cinema, Heroin-TeluguStop.com

అందువలన ఫ్రెండ్స్ తో రెగ్యులర్ గా పార్టీలకి వెళ్తూ ఉంటారు.ఈ నేపధ్యంలో హీరోయిన్స్ ఎవరితో అయిన అనుమానాస్పదంగా కనిపించిన, రెండు, మూడు సార్లు ఒకే వ్యక్తితో కనిపించిన వెంటనే అతనితో రిలేషన్ అంటగట్టేస్తారు.

ఈ కల్చర్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లోకి కూడా వచ్చింది.నార్త్ నుంచి ఎక్కువగా హీరోయిన్ తెలుగులోకి వస్తూ ఉండటంతో వారి మీద ఆటోమేటిక్ గా గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి.

అలాగే సౌత్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా మీద కూడా ఈ మధ్య ఎక్కువగా ఎవరితో ప్రేమలో ఉందనే వార్త వినిపిస్తుంది.త్వరలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతుంది అంటూ జోరుగా టాక్ వినిపిస్తుంది.

ఈ వార్తలపై తాజాగా రాశిఖన్నా క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం నా ధ్యాస మొత్తం కెరీర్‌పైనే ఉంది.లాక్‌డౌన్‌ కారణంగా షూటింగులు లేకపోయినప్పటికీ నిరంతరం నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా.ఈ క్రమంలో ఇతర భాషల్ని నేర్చుకోవడం, నటనకు సంబంధించిన మెళకుల్ని మెరుగు పర్చుకోవడం వంటి వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నా.

ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో ప్రేమ గురించి ఆలోచించే తీరిక నాకు లేదు.నేను ప్రేమలో ఉన్నట్టు ఇప్పటికే పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వాటిని చదువుకుని నేను ఎవరెవర్ని ప్రేమిస్తున్నానో తెలుసుకుని, నవ్వుకుంటున్నాను.ఒకవేళ నిజంగా నేను ప్రేమలో పడినా లేకపోతే పెళ్ళి చేసుకోవాలని అనిపించినా ఫస్ట్‌ మీకే పిలిచి మరీ చెబుతా అని రాశిఖన్నా చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube