ఆ విషయంలో అస్సలు తగ్గనంటున్న రాశీఖన్నా..?  

rashi khanna shocking comments about remuneration,pratiroju pandage, rashi khanna , rashi remuneration, social services, world famous lover - Telugu Pratiroju Pandage, Rashi Khanna, Rashi Remuneration, Social Services, World Famous Lover Movie

నాగ శౌర్య హీరోగా నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాతో ఏడేళ్ల క్రితం హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి వరుస అవకాశాలతో బిజీగా ఉంది రాశీఖన్నా.గతేడాది ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ కొట్టిన రాశీఖన్నా ఈ సంవత్సరం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో యామిని పాత్రలో నటించి మెప్పించింది.

TeluguStop.com - Rashi Khanna Shocking Comments About Remuneration

తమిళంలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న రాశీ తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ విషయాలతో పాటు తను చేసే సామాజిక సేవల గురించి సైతం స్పందించారు.

సినిమాలో తన పాత్రను బట్టే రెమ్యునరేషన్ తీసుకుంటానని.పాత్ర కఠినంగా ఉంటే కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తానని.కష్టానికి తగిన రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పు లేదని రాశీఖన్నా చెప్పారు.అదే సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా చెత్త పాత్రల్లో నటించడానికి ఇష్టపడనని.

TeluguStop.com - ఆ విషయంలో అస్సలు తగ్గనంటున్న రాశీఖన్నా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పాత్రను బట్టి రెమ్యునరేషన్ ను తీసుకుంటానని రాశీఖన్నా చెప్పుకొచ్చారు.

తనకు రెమ్యునరేషన్ విషయంలో పూర్తి స్పష్టత ఉంటుందని తెలిపారు.

సినిమాల్లో రెమ్యునరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉండడంలో తప్పేం లేదని రాశీఖన్నా చెప్పుకొచ్చారు.అయితే ఆ రెమ్యునరేషన్ సేవా కార్యక్రమాల కోసం ఎక్కువగా వినియోగిస్తానని రాశీఖన్నా తెలిపారు.

చాలామంది చిన్న పని చేసినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, మీడియా ముఖంగా ప్రకటించి గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే రాశీఖన్నా మాత్రం తాను సేవా కార్యక్రమాలు చేసినా చెప్పుకోవడం పెద్దగా ఇష్టపడనని తెలిపారు.మరోవైపు అందం, అభినయం పుష్కలంగా ఉన్నా చాలామంది స్టార్ హీరోలు రాశీ ఖన్నాను పట్టించుకోవడం లేదు.ఎన్టీఆర్ రాశిఖన్నాకు జై లవకుశ సినిమాలో ఛాన్స్ ఇవ్వగా ఆ సినిమా తరువాత మరే స్టార్ హీరో రాశీకు ఛాన్స్ ఇవ్వకపోవడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది.

#Social Services #WorldFamous #Rashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashi Khanna Shocking Comments About Remuneration Related Telugu News,Photos/Pics,Images..