బాలీవుడ్ కి వెళ్ళే ఆలోచన లేదని తేల్చేసిన రాశి ఖన్నా  

Rashi Khanna not interested in Bollywood Movies, Tollywood, South Cinemas, Bollywood, Rashi khanna - Telugu Bollywood, Rashi Khanna, Rashi Khanna Not Interested In Bollywood Movies, South Cinemas, Tollywood

బాలీవుడ్ లో జాన్ అబ్రహం మద్రాస్ కేఫ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన అందాల భామ రాశి ఖన్నా.మొదటి సినిమా హిట్ అయిన కూడా తెలుగులో సక్సెస్ అయ్యి స్టార్ హీరోయిన్ గా మారడంతో ఈ భామకి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది.

 Rashi Khanna Not Interested In Bollywood Movies

ఇక బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచించే సమయం కూడా లేకుండా రాశి ఖన్నా ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ వస్తుంది.తెలుగులో కుర్ర హీరోలు, స్టార్ హీరోలు అందరితో కూడా జత కడుతూ మంచి జోష్ చూపిస్తుంది.

గత ఏడాది నాలుగు సినిమాలు చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది ఆరంభంలో విజయ్ దేవరకొండకి జోడీగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకున్నా రాశిఖన్నాకి మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

బాలీవుడ్ కి వెళ్ళే ఆలోచన లేదని తేల్చేసిన రాశి ఖన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

అయితే చాలా మంది నార్త్ ఇండియా నుంచి వచ్చిన హీరోయిన్స్ సౌత్ లో స్టార్ స్టేటస్ రాగానే మరల బాలీవుడ్ వైపు చూస్తారు.

అక్కడ సినిమాలు చేయడానికి ఇష్టపడతారు.ఇలియానా, తాప్సి, శ్రియ, కాజల్ అగర్వాల్ ఇలా చాలా మంది భామలు హిందీ సినిమాలకి ప్రయారిటీ ఇస్తారు.అయితే హిందీ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుతం తన కెరియర్ లో సౌత్ సినిమాలు మాత్రమే ప్రయారిటీ అని రాశిఖన్నా అంటుంది.హిందీ సినిమాలు చేయాలనే ఆలోచన లేదని, నటిగా కెరియర్ కొనసాగించెంత కాలం సౌత్ భాషలలోనే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గితే మలయాళం, కన్నడంలో కూడా చేయడానికి తనకు అభ్యంతరం లేదని చెబుతుంది.తన ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయామని, సౌత్ సినిమాల మీద మాత్రమే తన ఫోకస్ అని రాశిఖన్నా చెప్పడం విశేషం.

#Rashi Khanna #RashiKhanna #South Cinemas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashi Khanna Not Interested In Bollywood Movies Related Telugu News,Photos/Pics,Images..