ఈ ఫొటోలో మాస్క్ ధరించి కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా…?  

Rashi khanna mask wearing photos viral in social media, Rashi khanna, mask photos,  Heroine Rashi kahnna with mask - Telugu @raashikhannaoffl, Instagram, Mask Photos, Rashi Khanna, Rashi Khanna Mask Wearing Photos Viral In Social Media, Tollywood

తెలుగు సినిమా పరిశ్రమలోకి  హీరోయిన్ గా అడుగు పెట్టిన అనతి కాలంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ మహారాజా రవితేజ, మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రామ్ పోతినేని తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని బాగానే రాణిస్తున్న “పంజాబీ రాశి ఖన్నా” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన “ఊహలు గుసగుసలాడే” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయమైంది.

TeluguStop.com - Rashi Khanna Mask Wearing Photos Viral In Social Media

ఆ తర్వాత తన అందం, నటన, అభినయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందుతోంది.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులు లేక ఇంటిపట్టునే ఖాళీగా ఉంటోంది.

TeluguStop.com - ఈ ఫొటోలో మాస్క్ ధరించి కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఈ క్రమంలో తాజాగా రాశి ఖన్నా మాస్కు ధరించిన ఫోటోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అలాగే ఈ ఫోటోకి “ఐ యామ్ నాట్ వితౌట్  మాస్క్” అని క్యాప్షన్ కూడా పెట్టింది.

బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించాలని అంతేగాక నిత్యం చేతులను శానిటైజర్ ద్వారా శుభ్రం  చేసుకోవాలని కూడా సూచించింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య రాశి ఖన్నా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన  “ప్రతి రోజు పండగే” చిత్రం లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే  అలరించింది.

 కానీ ఆ తర్వాత టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.  దీంతో రాశి ఖన్నా తన తదుపరి చిత్రం కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.

  అయితే ఇటీవలే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తమిళ రీమేక్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

#RashiKhanna #Instagram #Rashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashi Khanna Mask Wearing Photos Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..