మహా సముద్రంలోకి దూకుతున్న రాశీఖన్నా  

Rashi Khanna to play the lead in Mahasamudram, Tollywood, Telugu cinema, South cinema, Indian cinema, sharvanand - Telugu Indian Cinema, Rashi Khanna To Play The Lead In Mahasamudram, Sharvanand, South Cinema, Telugu Cinema, Tollywood

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా ఆర్ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న రెండో మహా సముద్రం.ఆర్ ఎక్స్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి పూర్తిగా ఇదే కథ మీద దృష్టిపెట్టడంతో పాటు చాలా మంది హీరోల దగ్గరకి తిరిగాడు.

 Rashi Khanna Mahasamudram Sharvanand

అయితే ఎవరూ ఈ మల్టీ స్టారర్ కథపై పెద్దగా ఆసక్తి చూపించలేదు.ఫైనల్ దీనికి శర్వానంద్, సిద్ధార్ద్ ఒకే చెప్పడంతో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యింది.

ఇంతలో కరోనా లాక్ డౌన్ కారణంగా మళ్ళీ వాయిదా పడింది.ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.

మహా సముద్రంలోకి దూకుతున్న రాశీఖన్నా-Movie-Telugu Tollywood Photo Image

త్వరలో సినిమాలు పట్టాలు ఎక్కించాలని చూస్తున్న అజయ్ భూపతి దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఒకరే ఉంటారని తెలుస్తుంది.

ఇక ఈ పాత్ర కోసం రాశీఖన్నాని ఫైనల్ చేసినట్లు సమాచారం.ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్యతో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పింది.

తెలుగులో మరే ఇతర సినిమాలు చేతిలో లేవు.దీంతో మహా సముద్రంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే స్నేహితులైన ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మధ్య స్నేహం, వైరం నేపథ్యంలో కథనం సాగుతుందని హీరోయిన్ ని ప్రేమించిన శర్వా ఓ దాడిలో చనిపోతాడని, ఆ తర్వాత రాశీ, సిద్ధార్థ్‌ల మధ్య జరిగే ప్రేమ సంఘర్షణే ఈ సినిమా అని కూడా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియాలంటే అజయ్ భూపతి క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి.

#Sharvanand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashi Khanna Mahasamudram Sharvanand Related Telugu News,Photos/Pics,Images..