సెలబ్రిటీ స్టేటస్ ఉండటం వలన ఎంత ఉపయోగమో చెబుతున్న రాశిఖన్నా

సెలబ్రిటీ స్టేటస్ అనేది కొంత మంది జీవితంలో వరంగా ఉంటే మరికొందరికి భారంగా మారుతుంది.సెలబ్రిటీలు అంటే కోట్ల రూపాయిల సంపాదన ఉంటుంది.

 Rashi Khanna Interesting Comments On Celebrity Status, Corona Second Wave, Sonu-TeluguStop.com

ఖరీదైన లైఫ్ జీవిస్తూ ఉంటారనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.అందుకే ఏదైనా కష్టసమయంలో సెలబ్రిటీలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరుకుంటారు.

అలా చేయని వారిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు.అలాగే ఒకరితో ఒకరిని పోల్చి చూపిస్తూ కామెంట్స్ చేస్తారు.

ఈ విధంగా సెలబ్రిటీలుగా ఉన్నవారు అభిమానంతో పాటు ప్రజల విమర్శలని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొంత మంది అదే పనిగా కొంత మంది సెలబ్రిటీలని టార్గెట్ చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలని ఎక్కువగా హైలైట్ చేస్తూ స్టార్ హీరోలని తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ పెట్టడంతో పాటు మీడియాలో కూడా నేరుగా విమర్శలు చేస్తున్నారు.అయితే సోనూసూద్ లా స్టార్ సెలబ్రిటీలు అందరూబయటకొచ్చి సేవా కార్యక్రమాలు చేయలేకపోవచ్చు కాని తమ స్థాయిలో ఏదో ఒక రూపంలో సమాజ సేవలో భాగం అవుతారు.

ఇదిలా ఉంటే తాజాగా రాశిఖన్నా సెలబ్రిటీ స్టేటస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Telugu Corona Wave, Chiranjeevi, Rashi Khanna, Sonu Sood, Tollywood-Movie

కరోనా లాంటి కష్టసమయంలో సెలబ్రిటీ స్టేటస్ ఉండటం చాలా ఉపయోగమని పేర్కొంది.సెలబ్రిటీలు అందరూ తమ హోదాని ఉపయోగించుకొని సమాజానికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది.ఒక వ్యక్తికి హోదా ఉండటం వలన ఎంత ఉపయోగం ఉంటుందో ఇప్పుడు అర్ధమవుతుంది.

సెలబ్రిటీ స్టేటస్ అంటే ఇదే అని, కొంత మంది సెలబ్రిటీలు చేస్తున్న చారిటీలు చాలా గొప్పగా ఉన్నాయని రాశిఖన్నా చెప్పడం విశేషం.ఇక తన స్టేటస్ ని కూడా ఉపయోగించుకొని తాను కొన్ని స్వచ్చంద సంస్థలతో జత కలిసాను.

నాకు తోచిన స్థాయిలో నేను సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా.ప్రస్తుతం కష్టసమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు.అందరూ కలిసి చేస్తే ఆ సాయం ఎక్కువ మందికి అందుతుంది.దీనికోసం సెలబ్రిటీ సోషల్ మీడియా అస్త్రంగా వాడుకొని తమ ఫ్యాన్ బేస్ తో స్వచ్చందంగా ప్రతి ఒక్కరు సమాజ సేవలో భాగం అయ్యేలా చేయొచ్చు అని చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube