రాశిఖన్నా రంగస్థలం లో ఏం చేస్తుందో?

ఊహలు గుసగుసలాడే సినిమాతో తనదైన ప్రత్యేక ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ రాశిఖన్నా.నటిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా సింగర్‌గా కూడా ఈ అమ్మడికి పేరు వచ్చింది.

 Raashi Khanna In Rangasthlam Ramalaxmi Model Look, Raashi Khanna , Samantha In R-TeluguStop.com

మల్టీ ట్యాలెంటెడ్‌ అనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా ఉండే ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది.ఈ సందర్బంగా ఆమె ఇలా లంగా ఓణి కాస్ట్యూమ్‌ లో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

సోషల్‌ మీడియాలో రాశిఖన్నా ఈ స్టిల్స్‌ వైరల్‌ అవుతున్నాయి.ఇందులో రాశి చూస్తుంటే రంగస్థలం సినిమాలోని సమంత రామలక్ష్మి పాత్రను గుర్తు చేస్తుంది అంటున్నారు.

పల్లెటూరు గడుపు అమ్మాయి పాత్రలో ఈ అమ్మడు కూడా కనిపిస్తుంది.గతంలో రాశిఖన్నా చాలా ఎక్కువ బరువు ఉండేది.
ఊహలు గుసగుసలాడే సినిమా తో పాటు ఆ తర్వాత కొన్ని సినిమాలను చూస్తే ఆమె బరువు క్లీయర్‌గా అర్థం అయ్యేది.కాని ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు మెల్ల మెల్లగా పెరుగుతున్న సమయంలో తన వెయిట్‌ ను కూడా తగ్గించుకుంటూ వచ్చింది.

ఎన్టీఆర్‌ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని పెద్ద ఆఫర్లను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.ఈ లుక్‌తో ఎంతో మంది యంగ్‌ దర్శకుల గుండెను రాశి గిల్లి ఉంటుంది.

కనుక ఖచ్చితంగా వారు ఈమెను తమ సినిమాల కోసం సంప్రదిస్తారు అనే టాక్‌ వినిపిస్తుంది.ప్రస్తుతం ఈమె చేస్తున్న ఒక సినిమా షూటింగ్‌ కోసం ఇలా డ్రస్ అయ్యింది.

ఈమె ఎలాంటి కాస్ట్యూమ్స్‌ లో అయినా ఈజీగా సెట్‌ అవుతుందని ఇది నిరూపిస్తుంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రంగస్థలంలోని సమంతను గుర్తు చేస్తున్న రాశిఖన్నా ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని సమంత మాదిరిగా స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ దక్కించుకోవాలని కోరుకుందాం.

ఆల్‌ ది బెస్ట్‌ రాశి ఖన్నా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube