మరో క్రేజీ పాత్రతో రాశీఖన్నా?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నటి రాశి ఖన్నా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో తన నటనకు మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ప్రస్తుతం పలు భాషలలో వరుస సినిమాల్లో బిజీగా ఉంది.

 Rashi Khanna In Gopichand And Director Maruti-TeluguStop.com

ఇక రాశి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.ఇక ఈ బ్యూటీ ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండగా ఇప్పుడు మొత్తానికి సన్నబడిపోయింది.

తెగ వర్కౌట్లు చేస్తూ గ్లామర్ ను మరింత పెంచింది.

 Rashi Khanna In Gopichand And Director Maruti-మరో క్రేజీ పాత్రతో రాశీఖన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హిందీ సినిమాతో తొలిసారిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో కూడా మెప్పించింది.ఇక టాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా అంతా గుర్తింపును అందుకోలేకపోయింది.ఇదిలా ఉంటే తాజాగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో రాశి పాత్ర అచ్చం తాను ఇదివరకు నటించిన ప్రతి రోజు పండగే సినిమాలో ఏంజెల్ ఆర్న పాత్ర వలె ఉంటుందట.ఈ పాత్రలో రాశి టిక్ టాక్ కామెడీ యాంగిల్ లో చూపించిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ అన్ని సినిమాల్లో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక సినిమా గురించి రాశి ఖన్నా కొన్ని విషయాలు మాట్లాడుతూ మారుతి దర్శకత్వం లో ఏంజిల్ ఆర్నా తరువాత మళ్లీ అదిరిపోయే పాత్రలు నటిస్తున్నానని తెలిపింది.ఇక ప్రస్తుతం రాశిఖన్నా హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా కోలీవుడ్ లో రెండు సినిమాల్లో బిజీగా ఉంది.ఇక మొత్తానికి రాశి వరుస ఆఫర్ లతో తెగ బిజీగా ఉందని అర్థం అవుతుంది.

#Maruthi #Gopichand #Rashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు