ఐటం సాంగ్ అయినా ఓకే అంటుంది..!

ఊహలు గుసగుస లాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా అనతి కాలంలోనే సూపర్ క్రేజ్ దక్కించుకుంది.ఇక కుర్ర హీరోలకు మొదటి ఆప్షన్ గా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు కేవలం ఒకే టైపు పాత్రలే కాదు తనకు నచ్చేట్టు తన క్యారక్టర్ కు సూట్ అయ్యే ఏ పాత్రలనైనా చేసేందుకు సిద్ధమే అంటుంది.

 Rashi Khanna Green Signal For Item Song-TeluguStop.com

అంతేకాదు ప్రస్తుతం హీరోయిన్స్ అందరు ఐటం సాంగుల మోజులో ఉన్నారు కాబట్టి ఛాన్స్ వస్తే తాను కూడా ఐటం సాంగ్ చేసేందుకు సై అంటుంది అమ్మడు.
ఈ ఇయర్ ఇప్పటికే సుప్రీం తో హిట్ అందుకున్న రాశి ఖన్నా రీసెంట్ గా వచ్చిన రాం హైపర్ తో కూడా మరో హిట్ ఖాతాలో వేసుకుంది.

వస్తున్న లక్కీ ఆఫర్లే కాదు అవి హిట్ అవడంతో రెట్టింపు ఉత్సాహంతో రాశి ఖన్నా తెలుగు సినిమాను ఇప్పుడప్పుడే వదిలేదు లేదు అని ఇక్కడ తనకు సూట్ అయ్యే ఎలాంటి పాత్రలొచ్చినా చేసేందుకు సిద్ధమే అంటుంది.మరి అమ్మడి ఊపు చూస్తుంటే త్వరలోనే స్టార్ హీరోయిన్ గా టాప్ చెయిర్ కు ఎగబ్రాకేలానే ఉంది.

సో లక్కీ హ్యాండ్ గా క్రేజీ ఆఫర్లు తెచ్చుకుంటున్న రాశి ఖన్నాకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube