రుద్ర వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న రాశిఖన్నా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రాశిఖన్నా.ప్రస్తుతం ఈ బ్యూటీ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ కి జోడీగా పక్కా కమర్షియల్ మూవీలో నటిస్తుంది.అలాగే తమిళంలో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.సౌత్ లో ప్రతి ఏడాది మూడు, నాలుగు సినిమాలకి తక్కువ కాకుండా రాశి ఖన్నా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తుంది.

 Rashi Khanna Digital Entry With Rudra Web Series-TeluguStop.com

స్టార్ హీరోల పక్కన నటిస్తున్న రెమ్యునరేషన్ విషయంలో కొంత వెసులుబాటు రాశిఖన్నా దగ్గర ఉంటుంది.ఈ కారణంగానే దర్శకనిర్మాతలు ఎక్కువగా ఆమె దగ్గరకి వెళ్తున్నారు.ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ కథానాయికలు ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు.ఇప్పుడు ఇదే బాటలో రాశిఖన్నా కూడా నడుస్తుంది.

కాజల్, తమన్నా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి నటిగా సక్సెస్ అయినా వెబ్ సిరీస్ లతో మెప్పించలేకపోయారు.

 Rashi Khanna Digital Entry With Rudra Web Series-రుద్ర వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న రాశిఖన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సమంత మాత్రం ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నటిగా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రాశిఖన్నా కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుంది.సమంతకి డిజిటల్ స్క్రీన్ కి పరిచయం చేసిన రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఇప్పుడు రాశిఖన్నాని కూడా పరిచయం చేయబోతున్నారు.

విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కాంబోలో వారు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ కోసం రాశిఖన్నాని ఫైనల్ చేశారు.దీంతో పాటు అజయ్ దేవగన్ తో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ లో రుద్ర టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.

దీనిలో లీడ్ రోల్ కోసం రాశిఖన్నాని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.వెంటిలేటర్ ఫేమ్ ఏం.రాజేష్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.మొత్తానికి డిజిటల్ ఎంట్రీ ఇస్తూనే రెండు వెబ్ సిరీస్ లని రాశిఖన్నా ఖరారు చేసుకోవడం నిజంగా విశేషమనే చెప్పాలి.

#Rashi Khanna #Ajay Devagan #Raj&DK #Rudra #RashiKhanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు