ప్రభాస్ సినిమాలో రాశి ఖన్నా.. ఏ సినిమాలో అంటే?

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది.

 Rashi Khanna Act With Prabhas In Nag Ashwin Movie-TeluguStop.com

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కొలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉండగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకుందట.


 Rashi Khanna Act With Prabhas In Nag Ashwin Movie-ప్రభాస్ సినిమాలో రాశి ఖన్నా.. ఏ సినిమాలో అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈయన సినిమాలలో చాలా వరకు బాలీవుడ్ హీరోయిన్ లే ఎక్కువగా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నా కూడా ఓ పాత్రలో మెరవనుందట.ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నాడు.అందులో బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించనుంది.అంతే కాకుండా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఇందులో ఓ చిన్న పాత్ర కోసం రాశి ఖన్నా ను సంప్రదించారట.దీంతో రాశి కూడా ఓకే అనగా మొత్తానికి త్వరలో ప్రభాస్ సినిమాలో నటించనుంది.ఇదిలా ఉంటే రాశి ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న థాంక్యూ సినిమాలో బిజీగా ఉంది.

ఇక గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తుంది.ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది రాశి.

అందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.ఇక ఇవే కాకుండా కోలివుడ్ లో కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుందని సమాచారం.

ఇక బాలీవుడ్ లో కూడా మరో ప్రాజెక్ట్ అవకాశం వచ్చిందని తెలుస్తుంది.మొత్తానికి వరుస సినిమాలలో బాగా దూసుకుపోతున్న రాశి ఖన్నా ఎటువంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

#PrabhasAnd #RashiKhanna #RashiKhanna #Prabhas #Rashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు