కన్నీరు ఆగలేదు.. పెళ్లి చేసుకోవాలనుకున్నా.! రాశి ఖన్నా సంచలన కామెంట్స్.! తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందట?

సెకండాఫ్‌ షూట్‌ చేస్తున్నప్పుడు నాకూ పెళ్లి చేసుకోవాలనిపించింది.అంత అద్భుతంగా ఉందీ సినిమా జర్నీ.

 Rashi Khanna About Srinivasa Kalyanam And Her Marriage-TeluguStop.com

ఈ జనరేషన్‌కి ఇలాంటి సినిమా కావాలి.షూటింగ్‌ పూర్తయ్యాక ఈ టీమ్‌ని వదిలి వెళ్లడానికి మనసు రాలేదు.

నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పిన ప్రియాంకా కూడా ఫోన్‌ చేసి ఏడుస్తూ మంచి సినిమా చేశావని చెప్పింది.నితిన్‌ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు.

కథ విన్నప్పటికీ విజువల్‌గా చూసినప్పటికీ చాలా తేడా ఉంది.నేను ఊహించిన దానికన్నా సతీశ్‌గారు గ్రాండ్‌గా తెరకెక్కించారు.

రెండ్రోజుల క్రితమే కాపీ చూసి భావోద్వేగానికి లోనయ్యా.పెళ్లిలో ఉన్న గొప్పతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన డైరెక్టర్‌ సతీశ్‌గారి పాదాలకు నమస్కరించాను.

శ్రీనివాస కళ్యాణం సినిమా గురించి రాశి ఖన్నా మాటలివి.ఆదివారం (ఆగస్టు 5) శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రత్యేక ప్రదర్శన వేశారు.

ఈ సినిమా చూసిన తర్వాత రాశీ ఖన్నా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పింది.

ఉత్తరాదికి చెందిన అమ్మాయిని కావడం వల్ల తెలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని రాశీ ఖన్నా తెలిపింది.తెలుగువారి పెళ్లిళ్లకు హాజరైనా.వధూవరులతో ఫొటో దిగి రావడమే తప్ప సంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆమె చెప్పింది.

శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుగు పెళ్లి తంతుల పరమార్థం తెలిసిందని చెప్పుకొచ్చింది.

‘తొలిప్రేమ’లో నా పాత్ర చూసి దిల్‌ రాజు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు.దీని తర్వాత ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించునే మరిన్ని పాత్రలు దక్కుతాయని గట్టిగా నమ్ముతున్నా.ఇటీవల తెలుగులో ఓ సినిమా సైన్‌ చేశా.

మూడు తమిళ సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి.ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో చాలా ఆనందంగా ఉన్నా.

నార్త్‌ సినిమావైపు వెళ్లాల్సిన అవసరం లేదు అని బాలీవుడ్ ఎంట్రీ గురించి చెప్పకనే చెప్పింది రాశి.చివర్లో భవిష్యత్తులో తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాశీ నవ్వుతూ చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube