గతంలోకి వెళ్లాలంటున్న రాశీఖన్నా.. అసలేమైందంటే..?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నటి రాశి ఖన్నాతన నటనతో అతి తక్కువ సమయంలో ఓ గుర్తింపును సొంతం చేసుకుంది.తొలిసారిగా హిందీ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన రాశి ఆ తర్వాత తెలుగులో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమా లో హీరోయిన్ గా పరిచయం అయింది.

 Rashi About Memories-TeluguStop.com

కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో కూడా నటించింది.

మనం సినిమా ద్వారా అతిథి పాత్రలో కనిపించిన రాశి ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపుతో సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంది.

 Rashi About Memories-గతంలోకి వెళ్లాలంటున్న రాశీఖన్నా.. అసలేమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం వంటి భాషలో కూడా నటించింది.ఇక ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు లేకపోగా గత ఏడాది వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించింది.

కానీ ఆ సినిమా కూడా తనకు అంత గుర్తింపు తేలేకపోయింది.ఇదిలా ఉంటే బాలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్లతో బిజీగా ఉందని చెప్పవచ్చు.ఇక తాజాగా ఆమె గతంలోకి వెళ్లాలని ఉందంటూ కొన్ని విషయాలు పంచుకుంది.

రాశి ఖన్నా సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటుంది.అంతేకాకుండా ఎన్నో విషయాల గురించి ముచ్చటేస్తుంది.తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇక తాజాగా ఓ ఫోటోను షేర్ చేయగా అందులో రాశి మొత్తం సన్నబడి తన గ్లామర్ ను మరింత పెంచుకుంది.వర్కౌట్ లతో తన శరీర బరువు తగ్గించుకొని ఫోటో షూట్ లతో బిజీగా ఉంటుంది.

ఇక తన హాట్ ఫోటోను షేర్ చేయగా ఓ పోస్ట్ చేసింది.తనకు గతంలో కి వెళ్లాలని అప్పుడప్పుడు అనిపిస్తుందట.కానీ దేనిని మార్చడానికి వీలు కాదు కాబట్టి కొన్ని క్షణాలను మరోసారి ఆస్వాదించాలని, ఇలాంటి అందమైన రోజులు మళ్లీ అనుభవించాలని ఉందని తెలిపింది.

#Rashi Kanna #Memories #Srinivas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు