ప్రభాస్ సలార్ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రశాంత్ నీల్..?

Rashant Neil Was Upset With Prabhas Salar Movie

పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

 Rashant Neil Was Upset With Prabhas Salar Movie-TeluguStop.com

ఇకపోతే ప్రభాస్ కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

 Rashant Neil Was Upset With Prabhas Salar Movie-ప్రభాస్ సలార్ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రశాంత్ నీల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ ప్రాజెక్టు కె షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్ల కొన్ని రోజులపాటు ఈ సినిమాను వాయిదా వేశారు.

ప్రాజెక్ట్ కే షెడ్యూల్ ముగిసిన తర్వాత ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.ఇకపోతే ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ భారీ యాక్షన్ సన్నివేశంతో ఉండబోతోందని మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి అయిందని అయితే ఈ సన్నివేశాలపై ప్రశాంత్ నీల్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Telugu Prabhas, Prashant Neil, Salar, Tollywood-Movie

ఇక ఈ యాక్షన్ సన్నివేశం తనకి తృప్తి కలిగించకపోగా ఇందులో కొన్ని మార్పులు చేసి తిరిగి యాక్షన్ సన్నివేశాన్ని షూటింగ్ చేయాలని భావించారు.ఇక ప్రశాంత్ నీల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభాస్ అభిమానులు స్వాగతిస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం వల్ల ప్రతి చిన్న విషయంలోనూ డైరెక్టర్ ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

#Salar #Prabhas #Prashant Neil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube