మానేరు జలాశయంలో అరుదైన దృశ్యం..!

మీరు ఎప్పుడైనా టోర్నాడో అనే పదం గురించి విన్నారా.అదేనండి తెలుగులో సుడిగాలి, తీవ్రమైన తుఫాను అర్థాలు వస్తాయి.

 Rare View Of Maneru Reservoir-TeluguStop.com

సముద్రంలో ఉన్నట్టుండి భారీగా నీరు పైకి ఎగిసి పడుతుంటాయి.సాధారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో టోర్నడో లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

కానీ కరీంనగర్ జిల్లాలో గతంలో ఎప్పుడు జరగని అరుదైన దృశ్యం జనాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.ఎప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని చూడకపోవడంతో స్థానికులు ఎంత భయానికి గురి అయ్యారు.

 Rare View Of Maneru Reservoir-మానేరు జలాశయంలో అరుదైన దృశ్యం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని వచ్చునూరు గ్రామ శివారులో నీ లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్ వాటర్ లో ఒక టోర్నడో లాంటి దృశ్యం కనిపించింది.నీరు సుడిగాలిలో చిక్కుకొని తిరుగుతూ ఆకాశంలోకి ఎగిసి పడింది.

అరుదైన దృశ్యం శనివారం సాయంత్రం ఆవిష్కృతమైంది.అయితే ఎక్కువగా టోర్నాడో విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

అవి ఏకంగా గ్రామాలను సైతం నాశనం చేసిన ఘటనలు ఉన్నాయి.ఒకవేళ ఇళ్ల మీదుగా ప్రయాణిస్తే కట్టడాలన్నీ నామరూపాల్లేకుండా నాశనమైపోతాయి.

అలాంటిది కరీంనగర్ జిల్లాలో ఏర్పడిన తరుణంలో కేవలం నీటిని మాత్రమే తీసుకుపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.అయితే ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కొంత భయపడ్డారు.

కొందరు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు.అక్కడే పొలం పనులు చేసుకుంటున్న కొందరు వ్యక్తులు ఈ దృశ్యాన్ని అన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది.దాదాపు 30 నిమిషాల పాటు ఆకాశం లోకి వెళ్లినట్టు స్థానికులు చెప్పారు.ఇంతకుముందు దు 2016 జూలై 31 న ఇదే జలాశయం నడిమధ్యలో వాటర్ స్పాట్ ఏర్పడినట్లు పలువురు చెబుతున్నారు.

#Water Fall #Maneru Water

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube